కొడంగల్ బరిలో కవిత – కేసీఆర్ మార్క్ స్కెచ్   KCR Mind Game In Kodangal Politics     2017-11-12   02:07:59  IST  Bhanu C

కేసీఆర్ రాజకీయ చతురత ముందు ఎంతోమంది తలపండిన నాయకులకి చెమటలు పట్టించాడు. తన ఎత్తులకి పై ఎత్తులు వేసే రాజకీయనాయకులు ఇప్పటివరకు కేసీఆర్ కి తారసపడలేదు.కేసీఆర్ తెలంగాణ కాంగ్రెస్ కి ఈ మధ్యకాలంలో చుక్కలు చూపిస్తున్నాడు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. తాజాగా పార్టీ మారి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి.. ‘దమ్ముంటే కొడంగల్లో నన్ను ఓడించిచూడమంటూ’ కేసీఆర్ కు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి..సైతం సవాలు చేస్తూ ..వందమంది కేసీఆర్లు వచ్చినా..తనకి నష్టం లేదని తెలిపారు. ఇప్పుడు రేవంత్ ఎక్కడ మాట్లాడినా సరే కేసీఆర్ కి సవాల్ విసురుతున్నారు.

కొడంగల్ ఉపఎన్నిక రావాలి అంటే రేవంత్ రాజీనామా ఆమోదించాబడాలి.అయితేనే ఉపెన్నికలు ఫిక్స్ అని నమ్మవచ్చు…ఒక వేళ ఉపఎన్నిక వచ్చేస్తే కొడంగల్ సీటు ఎలా అంటూ ఇప్పటికే రాజకీయ వర్గాలు జోరుగా పావులు కదుపుతూ ఉన్నాయి. ఇప్పటికే కేసీఆర్ ఆకర్ష్ ఆపరేషన్ మొదలెట్టేశాడు…వచ్చినవారిని వచ్చినట్టు పార్టీలో చేర్చుకున్తున్నారు. కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా రేవంత్ లాంటి బలమైన వ్యక్తిని కొడంగల్ లో ఎదుర్కోవాలి అంటే మామూలు విషయం కాదు..అందుకే కేసీఆర్ వేస్తున్న ఈ నయా స్కెచ్ కి..అక్కడ మిగతా పార్టీ నేతలకి గుబులు పుడుతోంది..ముఖ్యంగా కాంగ్రెస్ నేతలకి ఇది ఒకరకంగా షాకింగ్ అనే చెప్పాలి.

ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో వినిపిస్తున్న విషయం ఏమిటి అంటే ఎంపీగా పార్లమెంటుకే పరిమితమైన కవితను రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకురావాలన్న ప్రతిపాదన ఎప్పటినుంచో పార్టీలో ఉన్నా. ప్రస్తుత పరిస్థితులు మాత్రం కొడంగల్ నుంచీ కవితని పోటీ చేయించేలా ఉన్నాయి..ఈ విషయంలో ఇప్పటికే కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది..మరి కొడంగల్ కోట ఎవరి ఖాతాలోకి చేరుతుందో వేచి చూడాల్సిందే.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.