కేంద్రమంత్రులతో సమావేశమైన కేసీఆర్..!!

దాదాపు ఆరు రోజుల నుండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ తో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో బేటీ అవ్వడం జరిగింది.

 Kcr Meets Union Ministers Kcr , Modi, Gajendra Sing Shekavath, Gadkari-TeluguStop.com

అనంతరం కేంద్ర జల శక్తి మంత్రి తో పాటు.కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తో భేటీ అయ్యారు.

మొట్టమొదట రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ని కలిసిన సమయంలో కెసిఆర్ ఆయనకి పుష్పగుచ్ఛాలు అందించి శాలువా కప్పి.సత్కరించారు.

అనంతరం ఐదు అంశాలకు సంబంధించి లేఖలు అందించడం జరిగింది.అదే రీతిలో విజయవాడ హైదరాబాద్ హైవే నీ ఆరు లైన్ ల హైవే గా విస్తరించాలని.

శ్రీశైలం రహదారిని అదేవిధంగా కల్వకుర్తి హైదరాబాద్ రహదారిని అభివృద్ధి చేయాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1138 కిలోమీటర్ల మేర రహదారులు అభివృద్ధి చేయాల్సి ఉందని.

అదే రీతిలో రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో కూడా కేంద్రం చొరవ తీసుకోవాలని కెసిఆర్ సూచించినట్లు పార్టీవర్గాలు తెలియజేశాయి.ఇక ఆ తర్వాత.కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ కావడం జరిగింది.ఈ సందర్భంగా కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేయటం మాత్రమే కాక.కారణాలు కూడా వివరించారు.ఇక ఇదే సమయంలో కృష్ణా నది నుంచి తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పై వాదనలు వినిపించడం జరిగింది.

ఏదిఏమైనా ఢిల్లీలో వరుస భేటీలతో.సీఎం కేసీఆర్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube