ప్రశాంత్ కిషోర్ టీమ్ తో కేసీఆర్ ...? ఇవన్నీ చర్చించారా ? 

గత కొంత కాలంగా టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ రాజకీయం గా స్పీడ్ పెంచారు.  బీజేపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ, ఢిల్లీ పెద్దలకు సైతం ఆగ్రహం కలిగేలా చేస్తున్నారు.

 Prasanth Kishore, I Pack Team, Congress, Bjp, Trs, Telangana Government, Kcr Del-TeluguStop.com

కేంద్ర మంత్రులపైనా అంతే స్థాయిలో విరుచుకుపడుతూ,  తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు.అసలు కేసీఆర్ తీవ్రస్థాయిలో స్పీడ్ పెరగడానికి కారణం ఏమిటనే విషయం ఎవరికీ అంతుపట్టడం లేదు.

సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన కు వెళ్లడం బీజెేపీ కేంద్ర పెద్దలను కలిసేందుకు ప్రయత్నాలు చేయడం వారు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా,  నాలుగు రోజులపాటు అక్కడే ఉండి వెనక్కి వచ్చేయడం వంటి వ్యవహారాలు చోటుచేసుకున్నాయి.కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాతే ఆయన స్పీడ్ పెంచడం తో ఏం జరిగిందని ఈ విషయంపై తెలంగాణ రాజకీయ వర్గాలు ఆరా తీయగా,  ఆయన ఢిల్లీలో ప్రశాంత్ కిషోర్ తో ప్రత్యేకంగా సమావేశమై రాజకీయ వ్యవహారాలపై చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది .ప్రశాంత్ కిషోర్ సలహాలు సూచనలు కేసీఆర్ బీజేపీ పై స్థాయిలో మొదలుపెట్టారనే అభిప్రాయాలు కలుగుతున్నాయి.

ఇదిలా ఉండగా నిన్న ప్రగతి భవన్ లో ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ టీం కీలక బృందంతో కేసీఆర్ సమావేశమయ్యారనే వార్తలు బయటకు వచ్చాయి .ప్రస్తుతం తెలంగాణ లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు , ప్రజల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం పై పెరుగుతున్న వ్యతిరేకత బీజేపీ కాంగ్రెస్ పార్టీలు బలపడుతున్న తీరు వీటన్నిటినీ సమగ్రంగా కేసీఆర్ చర్చించినట్లు సమాచారం.ఈ సందర్భంగా ఐ ప్యాక్ టీమ్ సభ్యులు కేసీఆర్ కు కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

ఇక ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లో ప్రభుత్వం తీరుపై ఏ విధమైన అభిప్రాయం ఉంది ?  ఇంకా ఏమి చేస్తే ప్రజల్లో సానుకూలత ఏర్పరచవచ్చు అనే విషయాలపై త్వరలోనే ఐ ప్యాక్  టీం ప్రజాభిప్రాయాన్ని సేకరించి దానికనుగుణంగా నిర్ణయాలు తీసుకునేలా ఐప్యాక్ టీం కొన్ని సూచనలు చేయబోతోందట.రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితి,  ఎమ్మెల్యేలు,  మంత్రుల పనితీరు , ప్రజల్లో ఏఏ అంశాలపై ఎక్కువగా వ్యతిరేకత పెరుగుతోంది అనే విషయాలపై ఐ ప్యాక్ టీమ్ త్వరలోనే కేసీఆర్ కు నివేదిక రూపంలో ఇవ్వబోతున్నట్టు సమాచారం.

Telugu Congress, Pack, Kcr Delhi, Kcr Troubled, Pk, Telangana-Telugu Political N

ఇప్పటికీ ఏపీలో కేసీఆర్ స్నేహితుడైన సీఎం జగన్ కు ప్రశాంత్ కిషోర్ టీం రాజకీయ వ్యూహాలు అందిస్తోంది.  ఇప్పుడు టీఆర్ఎస్ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉండడంతో, జగన్ ద్వారానే కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ సేవలను పొందేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube