షాకింగ్‌ సర్వే ఫలితాలు.. రేవంత్‌ను ఎదుర్కొనేందుకు కేసీఆర్‌ మాస్టర్‌ ప్లాన్‌?       2018-07-04   02:54:51  IST  Bhanu C

దేశ వ్యాప్తంగా మెల్ల మెల్లగా ఎన్నికల వేడి రాజుకుంటుంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా పది నెలల సమయం ఉంది. అయినా కూడా దేశ వ్యాప్తంగా ముందస్తు ఎన్నికల గురించి ఊహాగాణాలు జోరుగా సాగుతున్నాయి. కేంద్రంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముందస్తు ఎన్నికల గురించి ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు ఎక్కువ ఛాన్స్‌ ఉందంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వల్ల ఉపయోగం ఎక్కువ ఉందనే ఉద్దేశ్యంతో టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ ముందస్తుకు సమాయత్తం అవుతన్నట్లుగా తెలుస్తోంది.

ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఫలితం ఏంటీ అనే విషయంపై నియోజక వర్గాల వారిగా సర్వేను చేయించారు. ఆ సర్వేలో మహబూబ్‌ నగర్‌ జిల్లా కొడంగల్‌ నియోజక వర్గంలో రేవంత్‌ రెడ్డి నూటికి నూరు శాతం గెవడం ఖాయం అన్నట్లుగా ఫలితం వచ్చింది. దాంతో కేసీఆర్‌ అండ్‌ కో ఆ స్థానంపై ప్రత్యేక శ్రద్ద పెట్టినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్‌లో ప్రస్తుతం బలమైన నాయకుడిగా ఎదుగుతున్న రేవంత్‌ రెడ్డి భవిష్యత్తులో మారు మాట్లాడకుండా ఉండాలి అంటే ఎమ్మెల్యేగా ఓడిపోవాలి. అప్పుడే ఆయన నోరు మూయించగలం, లేదంటే అసెంబ్లీలో మరియు బటయ ఆయన దాడిని తట్టుకోవడం కష్టం అని టీఆర్‌ఎస్‌ నాయకులు అంటున్నారు.

రేవంత్‌ రెడ్డికి పోటీగా సరైన నాయకుడిని దించాలనే ఉద్దేశ్యంతో కేసీఆర్‌ వ్యూహం రచిస్తున్నాడు. రేవంత్‌ను ఎదుర్కొగల నాయకుడి కోసం ప్రస్తుతం కేసీఆర్‌ అన్వేషిస్తున్నాడు. స్థానికుడు లేదా స్థానికేతరులను కూడా కేసీఆర్‌ పరిశీలిస్తున్నారు. త్వరలోనే కొడంగల్‌ నియోజక వర్గంలో టీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేయబోతున్న వ్యక్తిని ప్రకటించే అవకాశం ఉంది. ఆరు నెలల నుండే ఆ వ్యక్తి ప్రచారంను మొదలు పెట్టబోతున్నాడు. భారీ ఎత్తున అభివృద్ది పనులు చేయడంతో పాటో, అక్కడ ప్రజల్లో రేవంత్‌ రెడ్డిపై ఉన్న నమ్మకంను దెబ్బ కొట్టేందుకు టీఆర్‌ఎస్‌ నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

మొత్తానికి టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు రేవంత్‌ రెడ్డి ఓటమే లక్ష్యంగా భారీ వ్యూహాలను రచిస్తున్నారు. పార్టీ అధినాయకత్వం మరియు కింది స్థాయి నాయకులు కూడా రేవంత్‌ రెడ్డి ఓటమి కోసం కృషి చేయాలని నిర్ణయించుకున్నారు. 2019 ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యే అయితే కొడంగల్‌లోనే కాకుండా తెలంగాణలోనే కీలక నేతగా రేవంత్‌ రెడ్డి మారుతాడని, కేసీఆర్‌ అండ్‌ కో ఇంత ప్రయత్నాలు చేసినా కూడా గెలిచిస్తే కాంగ్రెస్‌ అధినాయకత్వం వద్ద మరింత బలం పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు రేవంత్‌ కాంగ్రెస్‌లో అత్యంత కీలక వ్యక్తిగా మారే అవకాశం ఉందనిపిస్తోంది.