ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కెసీఆర్ మార్క్... అసలు వ్యూహం ఇదేనా

తెలంగాణ రాజకీయాల్లో కెసీఆర్ ను మించిన రాజకీయ చాణక్యుడు లేడన్న విషయం ఎవరైనా ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే.అయితే కెసీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నారంటే దాని వెనుక చాలా పెద్ద వ్యూహం ఉంటుందని చాలా మంది కెసీఆర్ ను దగ్గరి నుండి చూసిన వాళ్ళు వ్యక్తం చేసే అభిప్రాయం.

 Kcr Mark In The Selection Of Mlc Candidates ... Is This The Real Strategy, Ts Po-TeluguStop.com

అయితే ఇప్పటికే రెండు సార్లు అధికారం చేపట్టిన కెసీఆర్ మూడవ సారి అధికారంలోకి రావడానికి ఇప్పటి నుండే కార్యాచరణను చేపట్టిన పరిస్థితి ఉంది.అయితే తాజాగా ఎమ్మెల్యే కోటాలో ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులను నామినేట్ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ అభ్యర్థులలో కొంత మంది ఊహించని పేర్లు వచ్చిన పరిస్థితి ఉంది.అయితే కెసీఆర్ ఎమ్మెల్సీ గా ఈ అభ్యర్థులను ప్రకటిస్తారనే ఆలోచన కూడా లేదు.

ఎవ్వరూ ఊహించలేదు కూడా.

అయితే ఉదాహరణకు మెదక్ మాజీ కలెక్టర్ వెంకట రామిరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తారని ఎవరూ ఊహించని పరిస్థితి ఉంది.

అయితే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ద్వారా సార్వత్రిక ఎన్నికల్లో రెబల్స్ లేకుండా అంతేకాక అక్కడ స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితులపై పూర్తి అవగాహన అంతేకాక పూర్తి స్థాయి పట్టు ఉన్న నాయకులే మెజారిటీగా ఈ అభ్యర్థుల లిస్ట్ లో ఉన్నారు.

Telugu @bjp4telangana, @cm_kcr, @trspartyonline, Bandi Sanjay, Bjp, Etala Rajend

అయితే ప్రస్తుతం చాలా వరకు క్షేత్ర స్థాయిలో బీజేపీ తో తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉండనున్న నేపథ్యంలో కెసీఆర్ చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది.అయితే ఎలాగైనా గతంతో పోలిస్తే ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలు గెలవాలన్న టార్గెట్ తో బీజేపీ ముందుకు నడుస్తుండగా మరల మూడో సారి విజయకేతనం ఎగరవేయాలన్నది టీఆర్ఎస్ లక్ష్యంగా అనిపిస్తోంది.ఏది ఏమైనా కెసీఆర్ వ్యూహాల ఫలితం ఏంటన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube