హుజూరాబాద్ పై కేసీఆర్ సరికొత్తగా  ?

సార్వత్రిక ఎన్నికల తరహాలో హుజురాబాద్ ఎన్నికల అంశాన్ని కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.టిఆర్ఎస్ కంచుకోటగా ఈ నియోజకవర్గం ఉండడంతో,  ఎక్కడా తమ పట్టు చే జారిపోకుండా కెసిఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.

 Kcr Making A Strategic Decision To Win In Huzurabad Kcr, Huzurabad, Etela Rajend-TeluguStop.com

ముఖ్యంగా మొన్నటి వరకు తమ పార్టీలో కీలకంగా వ్యవహరించడం, ఆ తరువాత తలెత్తిన పరిణామాలతో ఈటెల రాజేందర్ బీజేపీలో చేరడం , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఎన్నికలు అనివార్యమయ్యాయి.అయితే ఈ నియోజకవర్గం తనకు కంచుకోటగా ఉంది అని, ఇక్కడ గెలుపు తమదేనని నమ్మకం రాజేంద్ర లో ఉండగా, ఆ అవకాశం ఇవ్వకుండా,  ఆయన ఓటమే లక్ష్యం గా కేసీఆర్ పూర్తి స్థాయిలో ఈ నియోజక వర్గం పై దృష్టి పెట్టారు.

        ఈ మేరకు ఈ నియోజకవర్గంలోని కీలక నేతలు అందరికీ కేసీఆర్ ఫోన్ లు చేస్తున్నారు.ముఖ్యంగా కుల సమీకరణలకు పెద్ద పీట వేస్తూ, ఆ సామాజిక వర్గం కీలక నేతలు అందరినీ తమ దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ముఖ్యంగా హుజూరాబాద్ నియోజకవర్గం ఉన్న దళిత వర్గాలను ఆకట్టుకునే స్థాయిలో వరాలు ప్రకటిస్తున్నారు.దళిత బంధు పథకం ఈ నియోజకవర్గం నుంచి ప్రారంభించడంతో సామాజిక వర్గం ఓట్లు మొత్తం తమ పార్టీ కే వస్తాయని ధీమా లో ఉన్నారు.

ఇప్పటికే ఈ నియోజక వర్గంలో ఈటెల రాజేందర్ పాదయాత్ర ప్రారంభించడంతో కెసిఆర్ కూడా మరింత అలెర్ట్ అయ్యారు.దీంతోపాటు రాజేందర్ పట్టు పెరగకుండా ఉండేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు.
   

Telugu Congress, Etela Rajender, Huzurabad, Ramana, Revanth Reddy-Telugu Politic

     ఈ నియోజకవర్గంలో దళితులు, చేనేత కార్మికుల ఓట్లను సంపాదించగలిగితే తిరుగే ఉండదు అనేది కేసీఆర్  లెక్క.కేవలం బీజేపీ నేతలే కాకుండా కాంగ్రెస్ కు ఇక్కడ పట్టు దొరకకుండా ఉండేందుకు అన్ని మార్గాలు అన్వేషిస్తున్నారు.బీజేపీ కంటే రేవంత్ తమనే టార్గెట్ చేసుకోవడంతో కేసీఆర్ మరింత అలెర్ట్ అయినట్టుగా కనిపిస్తున్నారు. 

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube