మంత్రి మండలి ఏర్పాటుపై కేసీఆర్ ఫోకస్ !

తెలంగాణాలో రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడంతో కేసీఆర్ మంచి ఉత్సాహం మీద ఉన్నాడు.అందుకే ఇప్పుడు ఎన్నికల్లో తాను వాగ్దానం చేసిన అన్ని హామీల అమలుపైనా దృష్టిసారించారు.

 Kcr Main Focus On Telangana Cabinet-TeluguStop.com

ముందుగా ప్రతి గ్రామానికి ఒక పంచాయతీ సెక్రటరీ ఉండేలా కొత్తగా పోస్ట్లు మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపాడు.తన కుమారుడికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అప్పజెప్పి చాలా రిలాక్స్ అయ్యాడు.

ఇక ఇప్పుడు చేయాల్సిన ముఖ్యమైన పని … మంత్రి మండలి ఏర్పాటు.అవును కేసీఆర్ దృష్టాంతా ఇప్పుడు మంత్రిమండలి ఏర్పాటుపైనే ఉంది.

డిసెంబరు 13న సీఎంగా కేసీఆర్‌, హోం మంత్రిగా మహమూద్‌అలీ బాధ్యతలు చేపట్టారు.దీంతో మంత్రిర్గంలో తొలి విడత 8 మందికి చోటు దక్కనుందని తెలుస్తోంది.

డిసెంబరు చివరినాటికి మంత్రివర్గాన్ని విస్తరించాలని సీఎం నిర్ణయించారు.కానీ ఇప్పటికే ఆ పని మొదలుపెట్టేశాడు.

కాంగ్రెస్ నుంచి కొంత మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉన్నందున సగం మంత్రి పదవులు భర్తీ చేసి మిగతా సగం పెండింగ్ లో పెట్టాలని ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.అయితే, కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు దక్కితే తమకు ఎక్కడ చేజారిపోతుందోనని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మంత్రుల ఎంపిక విషయంలో పనితీరు ఆధారంగా ఎంపిక పూర్తి చేయాలనీ కేసీఆర్ భావిస్తున్నాడు.ఇందులో భాగంగా టీఆర్‌ఎస్‌లో చేరిన ఇద్దరు స్వతంత్రులతో సహా మొత్తం 90 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎమ్మెల్సీల జాబితాను తెప్పించి, అధ్యయనం చేపట్టారు.

వీరిలో ఎవరు తనకు వీర విధేయులో వారినే మంత్రివర్గంలోకి తీసుకోవాలని కేసీఆర్ డిసైడ్ అయ్యాడు.

అయితే కేసీఆర్ ఎవరెవరికి మంత్రి పదవులు కేటాయించబోతున్నారు అనే విషయంపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.గత ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసిన నాయిని నరసింహారెడ్డిని రాజ్యసభకు పంపించే అవకాశం కనిపిస్తోంది.పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, లక్ష్మారెడ్డి మళ్లీ మంత్రి పదవులు ఆశిస్తున్నారు.

వీరికి తోడు ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా రేసులో ముందున్నారు.ఇక కేసీఆర్ కి సన్నిహితుడిగా పేరున్న వనపర్తి ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన పద్మా దేవేందర్ రెడ్డి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు.

వీరిలో మొదటివిడతలో ఎవరికి సీటు దక్కుతుందో అన్న టెన్షన్ వారిలో పట్టుకుంది.అలాగే కేసీఆర్ కి అంత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డ తుమ్మల నాగేశ్వరరావు ఓటమి చెందడంతో….ఈ కోటాలో ఖమ్మం జిల్లాకే చెందిన పువ్వాడ అజయ్ కుమార్ మంత్రి పదవి ఆశిస్తున్నారు.అయితే… తుమ్మలను ఎమ్మెల్సీని చేసి మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ కూడా లేకపోలేదు.ఇలా ప్రతి జిల్లాలోనూ… మొదటి విడతలో సీటు దక్కించుకునేందుకు నాయకులూ పోటాపోటీ పడుతున్నారు.కేసీఆర్ మాత్రం సామజిక వర్గాల సమతుల్యత… విధేయత ఇవన్నీ పరిగణలోకి తీసుకునే మొదటి … రెండో విడత లిస్ట్ ను రెడీ చేసుకుంటున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube