జూన్ 3 వరకు లాక్‌డౌన్..?

ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు పలు దేశాలు అల్లాడుతున్నాయి.చైనాలో మొదలైన కరోనా వైరస్ వజృంభన ఇప్పుడు అనేక దేశాలకు పాకింది.

 Kcr, Lock Down, Corona Virus, Telangana-TeluguStop.com

దీంతో చాలా దేశాలు పూర్తి లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి.ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు ఇదొక్కటే మార్గమని ప్రభుత్వాలు అంటున్నాయి.

ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉన్నప్పటికీ, కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది.కాగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 350కు చేరువలో ఉంది.

దీంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుని కరోనా వైరస్ వ్యాప్తిని నివారించే పనులు చేపట్టింది.అయితే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావంపై తాజాగా సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు.

అందులో భాగంగా రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పరిస్థితిపై విశ్లేషించారు.అయితే బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ వారి నివేదిక ప్రకారం దేశవ్యా్ప్తంగా లాక్‌డౌన్ జూన్ 3వ తేదీ వరకు ఉంటే బాగుంటుందని కేసీఆర్ తెలిపారు.

అయితే లాక్‌డౌన్‌‌తోనే కరోనా వైరస్‌ను నివారించవచ్చని కేసీఆర్ అన్నారు.ప్రధాని నరేంద్ర మోదీతో కూడా లాక్‌డౌన్‌ను పొడగించాలని వ్యక్తిగతంగా కోరుతానని కేసీఆర్ అన్నారు.మరి ఈ లాక్‌డౌన్ పొడగింపు నిజంగానే ఉంటుందా? ప్రధాని కూడా ఈ పొడగింపుకు ఓకే అంటారా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube