గ్రేటర్ సమరంలో కి కేసీఆర్ ? పరుగులు పెట్టిస్తున్నారుగా ? 

గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవ్వడం తో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పార్టీ శ్రేణులను పరుగులు పెట్టించేందుకే తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్ధమైపోయారు.ఇప్పటి వరకు ఎవరో ఒకరికి బాధ్యతలు అప్పగించి పైపై వ్యవహారాలో ఉన్నట్లుగా వ్యవహరిస్తూ, వస్తున్న కెసిఆర్ , దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలతో  అసలు విషయం ఏమిటనేది స్పష్టంగా అర్థమైనట్టుగా కనిపిస్తోంది.

 Kcr Ktr Tension On Ghmc Elections, Ktr, Incharge, Kcr, Telangana, Ghmc Elections-TeluguStop.com

అందుకే ఇప్పుడు నేరుగా ఆయనే అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు , పార్టీ కీలక నాయకులు అందరితోనూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ,  పార్టీని గ్రేటర్ లో పరుగులు పెట్టించే విధంగా వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు అన్ని రకాలుగానూ ప్రయత్నిస్తున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా కాస్తోకూస్తో పేరున్న నాయకులు అందరినీ గ్రేటర్ లో మోహరించి వారికి గ్రేటర్ బాధ్యతలను అప్పగించే పనుల్లో కేసీఆర్ నిమగ్నమయ్యారు.

ఇప్పటికే మంత్రులు , ఎమ్మెల్యేలు పార్టీ ప్రధాన కార్యదర్శకులకు డివిజన్ల వారీగా బాధ్యతలను అప్పగించారు.అలాగే బూత్ ల వారీగా ప్రచారం చేసే విధంగా తగిన ప్రణాళికను రూపొందించారు.

అలాగే మంత్రులు అందరికీ ప్రచార బాధ్యతలను అప్పగించారు.ఒక్కో మంత్రికి 7 నుంచి 8 డివిజన్లను పరిరక్షించే విధంగా పని విభజన చేశారు.

ఇప్పటికే మంత్రులకు బాధ్యతలు అప్పగించడంతో వారంతా గ్రేటర్ బాధ్యల పనులను మొదలు పెట్టారు.ఏ జిల్లాలకు చెందిన మంత్రి ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహిస్తూ , వారికి అప్పగించిన గ్రేటర్ ఇన్చార్జి బాధ్యతలను డివిజన్ లోని సమస్యలను, పార్టీ పరిస్థితులను, కార్పొరేటర్ల పై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు , మొదలైన అన్నిటినీ ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటూ ,హైదరాబాద్ లోనే మకాం వేసినట్లు తెలుస్తోంది.

Telugu Dubbaka, Ghmc, Hyderabad, Telangana-Telugu Political News

ఇక కేటీఆర్ సైతం నిరంతరం ఇవే వ్యవహారాలపై బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.మొత్తం దుబ్బాక వ్యవహారంతో కేటీఆర్ , కేసిఆర్ వ్యవహార శైలిలో వచ్చినట్లుగా కనిపిస్తోంది.గ్రేటర్ లో బిజెపి, కాంగ్రెస్ తో పాటు కొత్తగా జనసేన కూడా రంగంలోకి దిగడంతో టిఆర్ఎస్ మరింతగా అప్రమత్తం అయినట్టుగా కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube