ఇక్కడ పరిస్థితి ఏం బాలేదు ! కేసీఆర్ రంగంలోకి దిగాల్సిందే ?

తెలంగాణ లో పరిస్థితులన్నీ తమకు అనుకూలంగానే ఉన్నాయని, ఇక తమకు తెలంగాణలో తిరుగులేదని భావిస్తూ వస్తున్నారు సీఎం కేసీఆర్.దుబ్బాక ఉప ఎన్నికల్లో కానీ , గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కానీ, విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 Kcr Key Desistion About Dubbaka Elections, Telangana Cm Kcr, Dubbaka By Election-TeluguStop.com

ఈ మేరకు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కలిగించే విధంగా కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.కొద్దిరోజుల క్రితమే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన కుమార్తె కవిత విజయం సాధించడంతో, మిగతా ఎన్నికల్లోనూ అంతే స్థాయిలో విజయం తమదేననే ధీమాలో కేసీఆర్ ఉంటూ వచ్చారు.

అయితే కొద్ది రోజులుగా తెలంగాణ లో చోటుచేసుకున్న పరిణామాలు కేసీఆర్ ను మరింత కంగారుకు గురిచేస్తున్నాయి.ఆకస్మాత్తుగా ముంచెత్తిన వర్షాల కారణంగా, తెలంగాణ మొత్తం అతలాకుతలం అవుతోంది.

ముఖ్యంగా  హైదరాబాదులో వరదలు రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.దీంతో సహజంగానే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది.ఈ సమయంలో ప్రభుత్వ ఖజానా సైతం నిండిపోవడంతో, ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో ఎల్ ఆర్ ఎస్ వసూలు చేస్తోంది.ఇప్పటికే పుట్టెడు కష్టాలు ఎదుర్కొంటున్న ప్రజలకు ఈ చర్య మహా ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.

ఇప్పటి వరకు ప్రభుత్వ పాలనపై సానుకూలత వ్యక్తం చేసిన వారంతా, ఇప్పుడు ఆగ్రహంగా ఉన్నారనే వార్తలు టీఆర్ఎస్ నాయకులకు ఆందోళన కలిగిస్తున్నాయి.ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం తమదేనని మొన్నటి వరకు ధీమా వ్యక్తం చేసిన ఆ పార్టీ శ్రేణులకు మారిన పరిస్థితులు తమకు ప్రతికూలంగా మారుతాయని ఆందోళన కలిగిస్తున్నాయి.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ విజయం సాధిస్తే, ఆ ప్రభావం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పనిసరిగా ఉంటుందని, కేసీఆర్ నమ్ముతున్నారు.అందుకే పార్టీ శ్రేణుల నుంచి ఒత్తిడి పెరిగి పోతుండటంతో, ఉప ఎన్నికల ప్రచారానికి స్వయంగా తానే రంగంలోకి దిగాలని కేసీఆర్ భావిస్తున్నారట.

ఇప్పటి వరకు దుబ్బాక ఉప ఎన్నికల బాధ్యతలు మొత్తం స్వయంగా మంత్రి హరీష్ రావు చూస్తున్నారు.టిఆర్ఎస్ గెలుపుకు అవసరమైన అస్త్రశస్త్రాలను ఆయన ఉపయోగిస్తూ, టిఆర్ఎస్ కు ఎదురు లేకుండా చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

హరీష్ రావు మంత్రాంగం పనిచేస్తున్నా, మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా, ఇప్పుడు కేసీఆర్ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దాలని చూస్తున్నారట.

హైదరాబాదులో తీవ్ర వర్షాభావం కారణంగా ఎదురైన వ్యతిరేకతను ధైర్యంగా ఎదుర్కొంటూ, విజయాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు కేసీఆర్ సిద్ధం అవుతున్నారట.

త్వరలోనే దుబ్బాకలో కేసీఆర్ పర్యటనకు సంబంధించి రూట్ మ్యాప్ సిద్ధం అవుతోందట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube