ఆ శాఖను మళ్లీ తనవద్దే ఉంచుకున్న కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తన మంత్రి వర్గంను పూర్తి స్థాయిలో విస్తరించారు.12 మందిగా ఉన్న మంత్రుల సంఖ్యను 18కి  పెంచారు.మంత్రి వర్గ విస్తరణకు ముందు కేసీఆర్‌ వద్ద పలు కీలక శాఖలు ఉన్నాయి.అయితే మంత్రి వర్గ విస్తరణ తర్వాత కీలకమైన ఆర్ధిక శాఖను హరీష్‌ రావుకు అప్పగించడం జరిగింది.

 Kcr Kept In Irrigation Branch-TeluguStop.com

అయితే ప్రస్తుతం తెలంగాణలో అత్యంత కీలకంగా భావిస్తున్న నీటిపారుదల శాఖను మాత్రం కేసీఆర్‌ తన వద్దే ఉంచుకన్నారు.గతంలో ఆ శాఖను హరీష్‌ రావు నిర్వహించారు.అత్యంత విజయవంతంగా హరీష్‌ రావు ఆ శాఖను నిర్వహించడంతో పాటు దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాడు.

నీటి పారుదలశాఖ ఇస్తే ప్రజల్లో హరీష్‌ రావుకు మద్దతు బాగా పెరిగి పోతుందనే ఉద్దేశ్యంతో ఆ శాఖను తన వద్దే ఉంచుకున్నాడు అంటూ కొందరు రాజకీయ విశ్లేషకులు విమర్శలు చేస్తున్నారు.

ఏపీతో నీటి ప్రాజెక్ట్‌ల గురించి కీలక చర్చలు ఉన్న కారణంగా తానే ఆ శాఖను నిర్వర్తిస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో కేసీఆర్‌ ఈ పని చేసి ఉంటాడు అంటూ మరి కొందరు అంటున్నారు.మొత్తానికి నీటి పారుదల శాఖను తన వద్ద ఉంచుకుని రైతుల నీటి కష్టాలు పోగొట్టేందుకు ప్రయత్నిస్తాను అంటున్నాడు.

ఇంకా కేసీఆర్‌ వద్ద రెవిన్యూ, జీడీపీ, ప్లానింగ్‌, మైనింగ్‌ శాఖలు కూడా సీఎం కేసీఆర్‌ వద్ద ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube