కేసీఆర్ ను ఇబ్బంది పెట్టేస్తున్న జగన్ ? అదేగా అసలు బాధ

ఇప్పటికే తెలంగాణలో కరోనా వైరస్ ను అదుపు చేయడంలోనూ, ఆ వైరస్ బారిన పడిన వారికి చికిత్స అందించడంలోనూ నిర్లక్ష్యం వహిస్తున్నారనే అపఖ్యాతిని తెలంగాణ సీఎం కేసీఆర్ మూటగట్టుకున్నారు.అసలు తెలంగాణలో పరిస్థితి ఇంత దారుణంగా మారినా, కేసీఆర్ ప్రజలకు ధైర్యం చెప్పేలా వ్యవహరించకుండా, అజ్ఞాతంలో ఉండిపోవడం పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

 Ap Cm Jagan Mohan Reddy Getting Good Name From Peoples ? Kcr Getting Suffer See-TeluguStop.com

అలాగే కారోనా ను కట్టడి చేసే విషయంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టకుండా, సచివాలయం కూల్చివేత పనులపైనా దృష్టి పెట్టి, మళ్ళీ 500 కోట్లతో సచివాలయం నిర్మించే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.ఇలా అన్ని రకాలుగా కేసీఆర్ విమర్శలు ఎదుర్కొంటున్నారు.

అలాగే చాలా రోజులుగా కేసీఆర్ కనిపించడం లేదంటూ పెద్దఎత్తున రాజకీయ విమర్శలు వస్తున్నా, ఆయన మాత్రం బయటకు రావడం లేదు.అలాగే కరోనా వైరస్ ప్రభావానికి గురైన వారికి చికిత్స అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, కనీసం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందే అవకాశం దొరకడం లేదని, సిఫార్సులు ఉన్న వారికి మాత్రమే అవకాశం దక్కుతుందని, ఇలా ఎన్నో వ్యవహారాలు కేసీఆర్ కు ఇబ్బందికరంగా మారాయి.

ఇదిలా ఉంటే ఏపీలో కరీనా వైరస్ వ్యాప్తి చెందకుండా, ఏపీ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, కరోనా వైరస్ ప్రభావానికి గురైనవారికి సత్వరమే చికిత్స అందిస్తుండడం, కరోనా నిర్ధారణ పరీక్షలు ఎక్కువగా చేయడం, ఇలా అన్ని విషయాల్లోనూ, సమర్థవంతంగా పని చేస్తూ దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.అదేవిధంగా కరోనా చికిత్స ప్రైవేట్ ఆస్పత్రిలో ను పొందే విధంగా అవకాశం కల్పించడంతో పాటు, ఆరోగ్యశ్రీ లోను చేర్చడంతో ప్రజల్లో జగన్ నిర్ణయంపై ప్రశంసలు వస్తున్నాయి.

ఇప్పుడు ఇదే కేసీఆర్ కు ఇబ్బందికరంగా మారింది.తెలంగాణలోనూ కరోనా వైరస్ చికిత్స ను ఆరోగ్యశ్రీలో చేర్చాలి అనే డిమాండ్ లు మొదలయ్యాయి.

Telugu Apcm, Arogya Sri, Coronavirus, Jagan Kcr, Jagan Rtc-

ఏపీలో ఆరోగ్య శ్రీ లో చేర్చినప్పుడు తెలంగాణలో ఎందుకు చేయలేకపోతున్నారు అంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి.పదేపదే ధనిక రాష్ట్రంగా చెప్పుకుంటూ, అభివృద్ధిలో దూసుకుపోతున్నము అంటూ మాటలు గారడీ చేస్తున్నారు తప్ప, క్షేత్రస్థాయిలో మాత్రం పని ఏమీ జరగడం లేదని, కేటీఆర్ ను సీఎం చేయాలని ఆత్రుత తప్ప తెలంగాణ ప్రజల గురించి పట్టించుకోవడం లేదంటూ ప్రతిపక్షాలు విమర్శలు మొదలుపెట్టాయి.ప్రతి పనికి ఏపీ సీఎం జగన్ తో పోలుస్తూ, తనను కార్నర్ చేయడంపై కేసీఆర్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.గతంలోనూ ఆర్టీసీని ప్రభుత్వ పరం చేస్తూ జగన్ నిర్ణయం తీసుకోవడం , తెలంగాణలోను అదేవిధంగా చేయాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేయడంతో పాటు , సమ్మె బాట పట్టడం ఇవన్నీ అప్పట్లో కేసీఆర్ తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఇప్పుడు కరోనా విషయంలోనూ ఇదేవిధంగా జగన్ తో పోలుస్తూ తను విమర్శించడంపై కేసీఆర్ కాస్త అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube