ఎడిటోరియల్ : బీజేపీ తిట్టినా తట్టుకుంటూ .. కేసీఆర్ జగన్ దాస్తున్న నిజం ఏంటి ?

కేంద్ర అధికార పార్టీపై పీకల్లోతు కోపం ఉన్నా, ఆ కోపాన్ని పైకి కనిపించకుండా చిరునవ్వులు చిందిస్తూ, ఆ పార్టీ తో సన్నిహితంగా మెలిగేందుకు ఏపీ సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారు.ఇక రెండు తెలుగు రాష్ట్రాల విషయంలో కేంద్ర అధికార పార్టీ బీజేపీ ఒక్కో సందర్భంలో ఒక్కో విధంగా వ్యవహరిస్తూ వస్తుంది.

 Kcr Jagan Silent On Bjp Coments,,ap Cm Jagan,bjp,telangana Cm Kcr-TeluguStop.com

ఇక ఏపీ విషయానికి వస్తే , ఇక్కడ సీఎంగా ఉన్న జగన్ ను శత్రువులా చూస్తున్నారా ? మిత్రపక్షంగా చూస్తున్నారా అనే విషయం ఎవరికీ క్లారిటీ లేకుండా పోయింది.ఒక్కో సందర్భంలో జగన్ తీసుకున్న నిర్ణయాలకు మద్దతు పలుకుతూనే , విమర్శలు చేస్తూ వస్తున్నారు.

అలాగే జగన్ తీసుకున్న మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు వంటి విషయాల్లో జగన్ కు బీజేపీ మద్దతు పలికింది.అంతే కాదు జగన్ తీసుకున్న ఎన్నో సంచలన నిర్ణయాలకూ అంతే స్థాయిలో సహకారం అందించింది.

అదే సమయంలో జగన్ పదే పదే విజ్ఞప్తి చేస్తున్న శాసన మండలి రద్దు, ఏపీ కి ప్రత్యేక హోదా విషయంలో తనపై అనుచితంగా విమర్శలు చేస్తూ వస్తున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు పై వేటు వేయాలని పదే పదే కోరుతున్నా స్పందన కనిపించడంలేదు.పోలవరం నిధులు విషయంలోనూ ఇదేవిధంగా వ్యవహరిస్తుండడం వంటి విషయాలు జగన్ కు ఎక్కడలేని ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.

ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు మధ్య వివాదం రేపిన జల వివాదాల విషయంలోనూ బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ ఆగ్రహం కలిగిస్తోంది.ఈ విషయంలో జగన్ తో పోల్చుకుంటే కేసీఆర్ కేంద్రంపై అప్పుడప్పుడు విమర్శలు చేస్తూ చురకలు అంటిస్తున్నారు.

ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం అనుచితంగా వ్యవహరిస్తోందనే వార్తలతో పాటు, జీఎస్టీ పరిహారం ఇవ్వకుండా తమను అప్పులు చేసుకోవాలని సలహాలు ఇవ్వడంపైన గుర్రుగా ఉన్నారు.రెండు తెలుగు రాష్ట్రాల విషయంలో బీజేపీ ఎంత కక్ష సాధింపు చర్యలతో విసిగిస్తున్నా, కేసీఆర్ కానీ, జగన్ కానీ ప్రధాని నరేంద్ర మోదీని తప్పుబట్టి విమర్శలు చేసేందుకు ధైర్యం చేయలేకపోతున్నారు.

అలాగే తమ పార్టీ నాయకులు సైతం విమర్శలు చేయకుండా జాగ్రత్త పడుతున్నారు.ఈ విషయంలో జగన్ కేసీఆర్ ఇద్దరూ ఒకే రకంగా వ్యవహరిస్తున్నారు.

కేంద్రంతో అనవసర పేచీలు పెట్టుకుంటే ఏం జరుగుతుందనే విషయం ఇద్దరు ముఖ్య మంత్రులకు బాగా తెలుసు.అదీ కాకుండా రాష్ట్రాలకు సంబంధించి నిధుల విషయంలో, కేంద్రం సహకారం చాలా అవసరం.

ఈ అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకునే రెండు రాష్ట్రాల విషయంలో బీజేపీ ప్రభుత్వంఎంత కక్షసాధింపు ధోరణి తో ముందుకు వెళ్తున్నా లెక్కచేయకుండా చిరునవ్వులు చిందిస్తూ ఉన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు.కేంద్రం విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రస్తుతం అవలంభిస్తున్న వైఖరి సరైందే అయినా, రాష్ట్రాలకు సంబంధించి హక్కులను సాధించుకోవడంలోనూ ఇదే వైఖరితో ఉండడం ఆయా రాష్ట్రాలకు తీరని నష్టమే కలిగిస్తుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube