ఆయనా ఈయనా ?  హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు ?

హుజూరాబాద్ నియోజకవర్గం బలమైన నేతగా ఎప్పటి నుంచో టిఆర్ఎస్ పార్టీలో పునాది వేసుకుని ఉన్న ఈటెల రాజేందర్ అకస్మాత్తుగా సీఎం కేసీఆర్ ఆగ్రహానికి గురై మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిపోయారు.ఇక వెంటనే ఆయన బీజేపీలో చేరడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, దానిని స్పీకర్ ఆమోదించడం జరిగిపోయింది.

 Kcr Is Unable To Decide Trs Candidate For Huzurabad, Trs, Telangana, Hujurabad,-TeluguStop.com

ఇప్పుడు ఇక్కడ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.దీంతో ఈటెల రాజేందర్ కు పోటీగా ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేయాలనే విషయంలో టిఆర్ఎస్ ఎటు తేల్చుకోలేక పోతుంది.

రాజేందర్ ను బలంగా ఢీ కొట్టగల ఆ స్థాయి నాయకుడు ఎవరనే విషయంపై టిఆర్ఎస్ ఇంకా ఆలోచనలోనే ఉంది.మరో వైపు చూస్తే రాజేందర్ బిజెపి తరఫున అప్పుడే యాక్టివ్ అయిపోయారు.

నియోజక వర్గం లో పర్యటిస్తూ, జనంలో తిరుగుతూ టిఆర్ఎస్ తనకు అన్యాయం చేసిందని, ఉద్యమకారులను దూరం చేసుకుంటోందని , తెలంగాణ ఇచ్చినా ఫలితం దక్కకుండా టిఆర్ఎస్ వ్యవహరిస్తోంది అంటూ హడావుడి చేస్తున్నారు.ఆయన దూకుడుకు కళ్లెం వేసే లో బలమైన అభ్యర్థి ఎవరు అనేది టీఆర్ఎస్ కు కష్టంగానే మారింది.

అయితే ఇక్కడి నుంచి టిఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు చాలా మంది నాయకులే ఉత్సాహపడుతున్నారు.దాదాపు పది మందికి పైగా తాము పోటీ చేస్తామని, అవకాశం కల్పించాలని కేసీఆర్ దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు.

Telugu Etela Rajendar, Hujurabad, Muddasanikasyap, Telangana-Telugu Political Ne

బీసీ సామాజికవర్గానికి చెందిన రాజేందర్ కు పోటీగా, అదే బీసీ సామాజికవర్గం నుంచి అభ్యర్థిని దించాలి అనేది  ఒక ప్లాన్ అయినా, ఇతర సామాజికవర్గాల లోనూ బలమైన అభ్యర్థుల పేర్లను పరిగణలోకి టీఆర్ఎస్ తీసుకుంటోంది.ఇప్పటికే మాజీమంత్రి ముద్దసాని కుటుంబం నుంచి, అలాగే కెప్టెన్ లక్ష్మీకాంతరావు కుటుంబం నుంచి అభ్యర్థులు పోటీ పడుతున్నారు.దామోదర్ రెడ్డి సోదరుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ముద్దసాని పురుషోత్తం రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది.అలాగే దామోదర్ రెడ్డి కుమారుడు కాశ్యప్ రెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

అలాగే కెప్టెన్ లక్ష్మీకాంతరావు కుటుంబం నుంచి వొడితెల రాజేశ్వరరావు మనవడు ప్రణవ్ బాబు పేరు పరిశీలనలో ఉంది.

Telugu Etela Rajendar, Hujurabad, Muddasanikasyap, Telangana-Telugu Political Ne

ఇంకా అనేక మంది ఇక్కడి నుంచి తమకు అవకాశం కల్పించాలని కేసీఆర్ కు తమ బయోడేటా తో కూడిన లేఖలను రాస్తున్నారు.అయితే హుజూరాబాద్ లో ఫలితం ఎలా ఉండబోతోంది అనే అంశంపై మాజీ ఎమ్మెల్యేలు, రిటైర్డ్ ఐఏఎస్ ల ద్వారా నివేదికలు, సర్వే రిపోర్టులు తెప్పించుకుంటున్నట్టు తెలుస్తోంది.వాటి ఆధారంగానే అభ్యర్థి ఎంపిక విషయమై ప్రకటన చేయాలని కేసీఆర్ చూస్తున్నారు.

ఏది ఏమైనా హుజురాబాద్ లో అభ్యర్థి ఎంపిక, గెలుపు టీఆర్ఎస్ కు కత్తి మీద సమ్మె అన్నట్టుగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube