బాబు బాటలో కేసీఆర్ ? టిఆర్ఎస్ లో సందడి !  

తెలంగాణ సీఎం కేసీఆర్ లో వచ్చిన అనూహ్యమైన మార్పు తో టిఆర్ఎస్ పార్టీలో సందడి వాతావరణం నెలకొంది.గతంలో కేసీఆర్ వ్యవహార శైలి ఎలా ఉన్నా, ఎవరికి అసంతృప్తి లేకుండా చేసేందుకు  ప్రయత్నాలు చేస్తున్నారు.

TeluguStop.com - Kcr Is Trying To Replace The Nominated Posts In Telangana

నాయకులతో చర్చలు జరుపుతూ, వారు కోరిన డిమాండ్లు తీర్చే ప్రయత్నం చేస్తున్నారు.అలాగే కుల సంఘాల మద్దతు పొందేందుకు ఎక్కువగా  ప్రాధాన్యం ఇస్తూ, కుల సంఘాల భవనాలకు శంకుస్థాపనలు చేస్తూ, అన్ని కులాల మద్దతు ఉండే విధంగా చూసుకుంటున్నారు.

దీంతోపాటు  పార్టీ  క్యాడర్ కు సరైన  పదవులు , ప్రాధాన్యం లేకుండా ఉండటం వంటి కారణాలతో వారిలో నిరాశానిస్పృహలు అలుముకున్నాయి అనే విషయాన్ని కేసీఆర్ గుర్తించారు.

TeluguStop.com - బాబు బాటలో కేసీఆర్ టిఆర్ఎస్ లో సందడి -Political-Telugu Tollywood Photo Image

 ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు ఏ తరహాలో పెద్దఎత్తున పార్టీ పదవులను సృష్టించి, కమిటీలను నియమించి పార్టీ కేడర్ లో కొత్త ఉత్సాహాన్ని తీసుకు వచ్చారో,అదే విధంగా ప్రస్తుతం ఏపీ టీడీపీ లో కొత్త ఉత్సాహం తీసుకురావడంలో దాదాపు సక్సెస్ అయ్యారు.

ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న కేసీఆర్ టీఆర్ఎస్ లోనూ అదే తరహాలో కొత్త ఉత్సాహం తీసుకురావాలని పెద్దఎత్తున పార్టీ పదవులు తో పాటు, ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్ట్ లను  పార్టీ కార్యకర్తలతో భర్తీ చేయాలని చూస్తున్నారు .ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తు పూర్తిచేసినట్లు తెలుస్తోంది.అలాగే నియోజకవర్గాల వారీగా పార్టీ నాయకుల మధ్య ఏర్పడిన గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టే విధంగా,  ప్రతి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎవరిలోనూ అసంతృప్తి , వివాదాలు లేకుండా చేసేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.

Telugu Ap, Chandrababu, Kcr, Ktr, Nominated Posts, Tdp, Telangana, Telugudesam Party, Trs-Telugu Political News

పార్టీ క్యాడర్ కు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ, ఎవరిలోనూ అసంతృప్తి లేకుండా చేసేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.ముందుగా రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులను , తరువాత జిల్లాస్థాయిలో పదవులను భర్తీ చేసి  రాబోయే ఎన్నికల్లో గట్టెక్కాలని కేసీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారు.

#Nominated Posts #Chandrababu #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kcr Is Trying To Replace The Nominated Posts In Telangana Related Telugu News,Photos/Pics,Images..