హుజురాబాద్ లో ఆ కీలక నేతను దింపేందుకు కేసీఆర్ యత్నం

తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు హుజురాబాద్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.హుజురాబాద్ అంటే ఈటెల.

 Kcr Is Trying To Bring Down That Key Leader In-TeluguStop.com

ఈటెల అంటే హుజురాబాద్ అన్నట్లుగా రాజకీయాల్లో, ప్రజల్లో ఒక ముఖచిత్రం ఏర్పడింది.ఇప్పటికే కేసీఆర్ కు ఈటెలకు మధ్య రాజకీయ యుద్ధం జరుగుతున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజులను ఏకం చేస్తూ పెద్ద ఎత్తున నేతలను సమీకరిస్తూ చర్చలు జరుపుతూ రకరకాల ఊహగానాలకు తెర దీస్తున్నాడు ఈటెల.

అయితే హుజురాబాద్ తన కంచుకోటగా భావిస్తున్నాన ఈటెలకు కేసీఆర్ చెక్ పెట్టేలా బలమైన వ్యూహ రచన రచిస్తున్నాడు.తాజాగా ఈటెల వ్యవహారంపై ఎంపీ కెప్టెన్ లక్ష్మీ కాంతారావు స్పందించిన విషయం తెలిసిందే.

 Kcr Is Trying To Bring Down That Key Leader In-హుజురాబాద్ లో ఆ కీలక నేతను దింపేందుకు కేసీఆర్ యత్నం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈటెల తనకు తానుగా పెద్దగా ఊహించుకుంటున్నాడని, అసైన్డ్ భూములను కొనడం నేరమని ఈటెలకు తెలియదా అని కెప్టెన్ లక్ష్మీ కాంతారావు ఘాటుగా హెచ్చరించారు.కేసీఆర్ ఆదేశిస్తే హుజురాబాద్ లో నేను పోటీ చేసేందుకు సిద్దమని లక్ష్మీ కాంతారావు ప్రకటించారు.

అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం కెప్టెన్ లక్ష్మీ కాంతారావు అన్న కొడుకు ప్రణవ్ ను ఉప ఎన్నిక వస్తే బరిలోకి దించనున్నట్టు తెలుస్తోంది.ఏది ఏమైనా కెప్టెన్ కామెంట్స్ ఇప్పుడు సరికొత్త ఊహగానాలకు తెరదీస్తున్నాయి.

మరి కెప్టెన్ మాటలపై ఈటెల ఎలా స్పందిస్తాడనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

#Eetela Rajendar #@CM_KCR #Trs Party

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు