కాంగ్రెస్ నాయకుడే టీఆర్ఎస్ అభ్యర్థి ? ఈటెల కు చెక్ ఇలా ?

ఎక్కడ తిరిగినా చివరికి అక్కడే అన్నట్లుగా తెలంగాణలో టిఆర్ఎస్ రాజకీయ మొత్తం ఇప్పుడు హుజురాబాద్ చుట్టూనే తిరుగుతోంది.అక్కడ ఈటెల రాజేందర్ ను ఒంటరి చేసి ఆయన రాజకీయ ప్రభావం ఏమీ లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

 Kcr Is Thinking Of Fielding Kaushik Reddy Against Ethela Rajender-TeluguStop.com

ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు, కేటీఆర్, మంత్రులు , కొంత మంది ఎమ్మెల్యేలు పూర్తిగా హుజూరాబాద్ నియోజకవర్గం పైన దృష్టి సారించారు.ఇప్పటికే టిఆరస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 14వ తేదీన బిజెపిలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

  ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం కావడంతో రాజేందర్ పై టీఆర్ఎస్ నుంచి ఎవరిని పోటీకి దింపాలి అనే విషయంపై టిఆర్ఎస్ లో ఒక క్లారిటీ రావడం లేదు.ఎందుకంటే ఈ నియోజకవర్గంలో టిఆర్ఎస్ నుంచి రాజేందర్ కు పోటీ ఇచ్చే సరైన నేత కనిపించకపోవడంతో అభ్యర్థి విషయంలో టిఆర్ఎస్ టెన్షన్ పడుతోంది.

 Kcr Is Thinking Of Fielding Kaushik Reddy Against Ethela Rajender-కాంగ్రెస్ నాయకుడే టీఆర్ఎస్ అభ్యర్థి ఈటెల కు చెక్ ఇలా -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే  రాజేందర్ కు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కౌశిక్ రెడ్డి వైపు టిఆర్ఎస్ చూపు పడింది.  ఆయన కాంగ్రెస్ లో కీలక నేతగా ఉండడంతో పాటు , గత ఎన్నికల్లో రాజేందర్ పైన కాంగ్రెస్ నుంచి పోటీ చేసి నలభై వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

Telugu Bjp, Congress, Etela Rajender, Huzurabad Constituency, Kcr, Koushik Reddy, Ktr, Mla, Telangana, Telangana Politics, Trs, Uttam Kumar Reddy-Telugu Political News

  నిత్యం రాజేందర్ కు సంబంధించిన అవినీతి వ్యవహారాలపై మాట్లాడుతూ,  నియోజకవర్గంలో సమస్యలను ఎత్తిచూపుతూ మంచి పలుకుబడి సంపాదించిన కౌశిక్ రెడ్డి రాజేందర్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.ఇటీవల రాజేందర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత కాంగ్రెస్ నేతలంతా ఆయనపై సానుభూతి వ్యక్తం చేస్తూ మాట్లాడినా కౌశిక్ రెడ్డి మాత్రం రాజేందర్ అవినీతి వ్యవహారాలు పైన మాట్లాడారు.ఈయన స్వయానా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కి వరుసకు సోదరుడు.

Telugu Bjp, Congress, Etela Rajender, Huzurabad Constituency, Kcr, Koushik Reddy, Ktr, Mla, Telangana, Telangana Politics, Trs, Uttam Kumar Reddy-Telugu Political News

ఈ కౌశిక్ రెడ్డి నే టిఆర్ఎస్ లోకి తీసుకువచ్చి ఆయనకే టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో కెసిఆర్,  కేటీఆర్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.ఇటీవల కౌశిక్ రెడ్డి స్నేహితుడు తండ్రి మరణించడంతో ఆయన దశదినకర్మ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.
  ఈ సందర్భంగా కేటీఆర్ పక్కనే కూర్చున్న కౌశిక్ రెడ్డి ఆయనతో మంతనాలు చేయడం,  కేటీఆర్ వెళ్లిపోయే సమయంలో ఆయన వద్ద ఏకాంతంగా చర్చించడం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయనే రాజేందర్ తరపున పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రచారం ఊపందుకుంది.

#Telangana #Etela Rajender #Congress #Koushik Reddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు