రాజకీయాల్లో నెగ్గుకు రావాలంటే మాత్రం కచ్చితంగా వ్యూహాలకు పదును పెట్టాల్సిందే.వ్యూహాత్మకంగానే మాట్లాడాలి.
అప్పుడు ప్రతిపక్షాలకు చెక్ పెట్టొచ్చు.లేదంటే మాత్రం ఇతరులు సెట్ చేసిన ట్రెండ్‌లో కొట్టుకుపోవాల్సి వస్తుంది.
ఇకపోతే ఇప్పుడు తెలంగాణలో కూడా ప్రతిపక్షాలు క్రమ క్రమంగా బలపడుతున్న సమయంలో టీఆర్ఎస్ కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది.ఇందులో భాగంగా ఇప్పుడు హరీశ్‌రావు సంచలన కామెంట్లు చేశారు.
అది కూడా కాంగ్రెస్, బీజేపీల మీద చేయడం చర్చనీయాంశంగా మారుతోంది.
ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ లకు ఇద్దరు కొత్త అధ్యక్షులు రావడానికి కారణం సీఎం కేసీఆరే అని ఆయన వల్లే వారికి పదవులు వచ్చాయని లేదంటే రాకపోయేవంటూ మంత్రి హరీష్ రావు కామెంట్లు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కొత్తా రేవంత్ రెడ్డి టీపీసీసీ అయ్యారని అసలు ఆయనకు ఆ పదవి ఎలా వచ్చిందంటూ ప్రశ్నించారు.కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడితే టీఆర్ఎస్ వల్ల తెలంగాణ రాబట్టి ఆయనకు పదవి వచ్చిందని లేకుంటే అస్సలు ఆయన ఎక్కడుండే వారంటూ కామెంట్లు చేశారు.
ఇక బండి సంజయ్ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి వచ్చిందంటే అందుకు తెలంగాణ రావడమే మెయిన రీజస్ అని లేకుండా అసలు బీజేపీ ఎక్కడుండేడిది అంటూ వ్యాఖ్యానించారు.ఇక్కడే హరీశ్ రావు తన కామెంట్ల ద్వారా తమ పార్టీ తెలంగాణ కోసం కొట్లాడిందని మరోసారి ప్రజలకు ప్రతిపక్షాలకు గుర్తు చేసే ప్రయత్నం చేశారు.తెలంగాణ కోసం బీజేపీ, కాంగ్రెస్ ఏనాడూ కొట్లాడలేదని వారికి అసలు గుర్తింపు లేదంటూ మండిపడ్డారు.మొత్తానికి ఇరు పార్టీల అధ్యక్షులను ఇరకాటంలో పెట్టే విధంగానే హరీశ్‌రావు వ్యూహాత్మక కామెంట్లు చేశారన్నమాట.
మరి ఆయన కామెంట్లపై వీరిద్దరూ ఎలాంటి రియాక్ట్ ఇస్తారో చూడాలి.