వారందరినీ ఒకే స్టేజి మీదికి తెచ్చేందుకు కేసీఆర్ న‌యా రూట్

తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ఆసక్తికరంగా హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం ఎదురు చూస్తున్నారు.ఇందుకు సంబంధించిన ఇంకా నోటిఫికేషన్ విడుదల కాలేదు.

 Kcr Is The New Route To Bring Themu All On The Same Stage, Kcr, Politics , Dalit-TeluguStop.com

కానీ, నియోజకవర్గంలో రాజకీయం రోజురోజుకూ మరింత హీటెక్కుతోంది.తాజాగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

ఈ క్రమంలోనే గులాబీ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎన్నికల బరిలో ముందుకు సాగనున్నారు.ఇకపోతే ఈ నియోజకవర్గం వేదికగానే ఈ నెల 16న సీఎం కేసీఆర్ ‘దళిత బంధు’ స్కీమ్ లాంచ్ చేయబోతున్నారు.

కాగా స్కీమ్ లాంచింగ్ సందర్భంగా ఏర్పాట్లు ఘనంగా ఉండాలని పింక్ పార్టీ అధినేత ఇప్పటికే పేర్కొన్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ వేదిక మీద దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులందరూ ఒకే చోట ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే అందరూ దళిత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, జిల్లా పరిషత్ సభ్యులను ‘దళిత బంధు’ స్కీమ్ లాంచింగ్ ప్రోగ్రాంకు రావాలని టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు నుంచి ఆదేశాలు జారీ చేశారు.

Telugu Dalitha Bandhu, Huzurabad, Karimnagar, Kcrroute-Telugu Political News

ఇకపోతే గతంలో పలు పథకాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ నుంచే ప్రారంభించిన సీఎం కేసీఆర్ ప్రస్తుతం ‘దళిత బంధు’ను పైలట్ ప్రాజెక్టు కింద ఈ నియోజకవర్గంలో ఆవిష్కరించనున్నారు.‘దళిత బంధు’ స్కీమ్ లాంచింగ్ సందర్భంగా నిర్వహించబోయే సభలో ఈ స్కీమ్‌కు సంబంధించిన పాటలను కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాటలు సిద్ధం చేసినట్లు సమాచారం.

సభా ప్రాంగణంలో వారే ఆ పాటలను ఆలపిస్తారని సమాచారం.ఇకపోతే ‘దళిత బంధు’ స్కీమ్ ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని టీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్లు ఆల్రెడీ సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి అందరికీ విదితమే.

కాగా,నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని దళితుల ఓట్లు టీఆర్ఎస్‌కే అని ధీమా వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube