తనకు అడ్డొచ్చిన వారిని టార్గెట్ చేస్తున్న కేసీఆర్... వచ్చే ఎన్నికలే టార్గెట్టేనా?

తెలుగు రాష్ట్రాలలో కేసీఆర్ కు మించిన రాజకీయ దురంధరుడు లేడనే చెప్పవచ్చు.రాజకీయ వ్యూహాలు వేయడంలో కేసీఆర్ ను మించిన రాజకీయ నేత లేదనడం అందరూ అంగీకరించాల్సిన విషయమే.

 Kcr Is Targeting Those Who Obstruct Him ... Is The Next Election The Target Kcr,-TeluguStop.com

అయితే ఒక్కొక్క రాజకీయ నాయకునికి ఒక్కో రాజకీయ విధానం, ఒక్కో పరిపాలన శైలి ఉంటుంది.అయితే కేసీఆర్ కు ఉన్న ప్రత్యేక శైలి ఏంటని ఒకసారి మనం గమనిస్తే కేసీఆర్ తీసుకునే నిర్ణయాల సారాంశం, ఆ నిర్ణయం వెనుక వ్యూహం ఎంతో ఆ వ్యూహం ఫలించి నాక అర్థమవుతుంది.

అయితే ఇప్పుడు కేసీఆర్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాడు.

అందులోనే భాగంగా తన నిర్ణయాలను వ్యతిరేకించిన వారిని టార్గెట్ చేస్తూ ఆ సదరు నాయకుడిని రాజకీయంగా బలహీనపర్చడం అనే వ్యూహాన్ని కేసీఆర్ ఎంచుకున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే ఈటెల విషయాన్ని బూచిగా చూపి మిగతా ఈటెల తరహా నాయకులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.అందుకే ఈటెల వ్యవహారంపై తమ స్వంత అభిప్రాయాన్ని ఎక్కడ బహిరంగంగా చెప్పడం లేదు.

అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుకు ఎవరు అడ్డుపడుతున్నారని కేసీఆర్ భావిస్తున్నారో వారిని ముందుగా పార్టీ నుండి ఏరివేయాలన్నది కేసీఆర్ వ్యూహంలా కనిపిస్తోంది.మరి ఇంకా రానున్న కాలంలో ఇంకేం సంచలన నిర్ణయాలు తీసుకుంటాడనేది చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube