ఢిల్లీ రైతులు సరే మా సంగతేంటి ? కేసీఆర్ కు ఇది తలనొప్పే ?

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణలు బిల్లును వ్యతిరేకిస్తూ పెద్దఎత్తున రైతులు ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.వారితో

 Kcr Is Supporting The Bharat Bandh Be Held Tomorrow, Bharath Bhandh, Formers Pro-TeluguStop.com

ఇప్పటికే అనేక దఫాలుగా కేంద్రం చర్చలు జరిపింది.

అయినా అవి కొలిక్కి రాలేదు. ఒకపక్క చర్చలు జరుపుతూనే,  మరోపక్క ఆ ఉద్యమాన్ని అణిచి వేసేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

తాము వ్యవసాయ సంస్కరణలు తీసుకు వచ్చింది రైతుల సంక్షేమం కోసమే అని, వారిని ఇబ్బంది పెట్టే ఈ విధంగా ముందుకు వెళ్ళము అని కేంద్రం చెబుతున్న,  రైతుల్లో ఈ చట్టం పై అనేక సందేహాలు ఉన్నాయి.అందుకే పట్టు విడవకుండా ఢిల్లీలో లక్షలాది మంది రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే రైతులకు మద్దతు గా   ఎన్డీఏ నుంచి కొన్ని పార్టీలుు  తప్పుకున్నాయి.మొత్తంగా ఈ వ్యవహారం కేంద్రానికి పెద్ద తలనొప్పిగా మారింది .

 వ్యవసాయ సంస్కరణలు బిల్లు విషయంలో రైతులు వెనక్కి తగ్గకపోగాా , భారత్ బంద్ కు పిలుపు ఇచ్చారు.దీంతో వివిధ పార్టీలు భారత్ బంద్ కు సంపూర్ణంగా మద్దతు ప్రకటించాయి.

అదేవిధంగా తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం ఈ భారత్ బంద్ కు మద్దతు పలికారు రైతులు చేస్తున్న దీక్ష లో న్యాయం ఉందని, అందుకే మద్దతు ఇస్తున్నామని, తెలంగాణలోనూ భారత్ బంద్ ను విజయవంతం చేస్తామని ప్రకటించారు.దీని ద్వారా పూర్తిగా రైతుల మద్దతు బీజేపీకి లేకుండా చేయాలి అనేది కేసీఆర్ ప్లాన్ గా కనిపిస్తోంది.

ఇంతవరకు బాగానే ఉన్నా,  రైతుల విషయంలో కేసీఆర్ ఎంత తపన పడుతున్నారో అని, అయినా వారిని  ఎందుకు పట్టించుకోవడం లేదని ? ఇక్కడ  నియంత్రిత సాగు అమలు చేసి, తెలంగాణ రైతులను నిండా ముంచి, దేశవ్యాప్తంగా రైతు పోరాటం కు  మద్దతు ఇవ్వడం ఎందుకని నిలదీస్తున్నారు.

Telugu Amith Sha, Bharath Bandh, Central, Delhi, Modi, Raithu Deeksha, Telangana

అలాగే సన్న వడ్ల కు మద్దతు ధర  ఇవ్వడం మానేసి ఇప్పుడు అకస్మాత్తుగా ఢిల్లీలో రైతులు చేస్తున్న దీక్షకు మద్దతు ఇవ్వడం రాజకీయ లబ్ధి కోసమేనని,  బీజేపీపై ఉన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి తప్ప,  రైతులపై ఏమాత్రం ప్రేమ లేదనే విమర్శలు ఆయన ప్రత్యర్థులు చేస్తున్నారు .అలాగే రైతు రుణమాఫీ పై ఎటూ తేల్చకుండా , వర్షాలతో నష్టపోయిన రైతులను కనీసం ఆదుకో కుండా,  భారత్ బంద్ కు ఏ విధంగా మద్దతు పలుకుతున్నారు అంటూ రైతు సంఘాలు కేసియార్ ను నిలదీస్తున్నాయి.భారత్ బంద్ కు మద్దతు ఇచ్చి బిజెపిని ఇరుకున పెడదామని చూస్తుండగా, అదే సమయంలో భారత్ బంద్ కారణంగా కెసిఆర్ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

ఢిల్లీ రైతుల అంశం విషయంలో బీజేపీ పై కేసీఆర్ ఏ విమర్శలు చేసినా, తెలంగాణలో రైతులు పరిస్థితి పై కేసీఆర్ పైన బీజేపీ అంతే స్థాయిలో విమర్శలు చేసేందుకు రెడీగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube