అతిగా జాగ్ర‌త్త ప‌డుతున్న కేసీఆర్‌.. ఎందుకింత మార్పు..?

Kcr Is Overly Careful Why Change

హుజురాబాద్ ఉప ఎన్నికల పోరులో టీఆర్ఎస్, బీజేపీలు పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నాయి.గెలుపు కోసం టీఆర్ఎస్ శతవిధాలా ప్రయత్నిస్తోంది.

 Kcr Is Overly Careful Why Change-TeluguStop.com

ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయంలో టీఆర్ఎస్ తర్జనభర్జనలు పడుతోంది.ఇందుకోసం టీఆర్ఎస్ అధినేతను కూడా హుజురాబాద్ కు తీసుకురావాలని యోచిస్తోంది.

గెలుపు కోసం టీఆర్ఎస్ పెద్ద ఎత్తులు వేస్తోంది.ఒక ఉప ఎన్నిక కోసం స్వయానా ముఖ్యమంత్రి రావడం అనేది ప్రస్తుతం అందరూ ఆశ్చర్యపోయేలా చేస్తుంది.

 Kcr Is Overly Careful Why Change-అతిగా జాగ్ర‌త్త ప‌డుతున్న కేసీఆర్‌.. ఎందుకింత మార్పు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఎలాగైనా పార్టీలో ఊపు తెచ్చేందుకు స్వయానా ముఖ్యమంత్రే రంగంలోకి దిగాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.రోడ్ షోలు కానీ బహింరంగ సభ కానీ నిర్వహించాలని టీఆర్ఎస్ నేతలు యోచిస్తున్నారు.

హుజురాబాద్ కు ఆనుకునే ఉన్న పెంచికల్ పేటలో మొదట బహిరంగ సభ నిర్వహించాలని టీఆర్ఎస్ యోచించినప్పటికీ అక్కడ కూడా ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో టీఆర్ఎస్ ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది.దీంతో బహిరంగ సభను పక్క నియోజకవర్గమైన హుస్నాబాద్ లో పెట్టాలా? లేక హుజురాబాద్ నియోజకవర్గంలోనే రోడ్ షోలు నిర్వహించాలా? అని టీఆర్ఎస్ తర్జనభర్జన పడుతోంది.

ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని మండలాలకు ఇన్ చార్జిలను నియమించిన టీఆర్ఎస్ ఎలాగైనా సరే ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలని భావిస్తోంది.కనీవినీ ఎరుగని జాగ్రత్తలు తీసుకుంటున్న కేసీఆర్ కోకి ఉప ఎన్నికల ఫలితం ఎలా వస్తుందో వేచి చూడాలి.ఈ ఉప ఎన్నికల కోసం బీజేపీ కూడా తెగ రాటపడుతోంది.బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు.ఈ ఉప ఎన్నికల్లో గెలవడం ఈటల రాజేందర్ కు చాలా ప్రతిష్టాత్మకంగా మారింది.ఈటల గెలుపు కోసం బీజేపీ శ్రేణులు తెగ ష్టపడుతున్నారు.

బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది.టీఆర్ఎస్ అవస్థలకు చెక్ చెప్పేందుకు కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

తాను స్వయంగా వెళ్లి.అక్కడ రోడ్ షో కానీ బహిరంగ సభ కానీ ర్వహించాలని చూస్తున్నట్లు సమాచారం.

#Trs #Etala Rajander #Huzurabad #Bjp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube