మ‌రోసారి అంబేడ్క‌ర్ సెంటిమెంట్‌ను ఉప‌యోగిస్తున్న కేసీఆర్‌..

తెలంగాణ‌ రాష్ట్రంలోని ద‌ళితుల అభ్యున్న‌తి.వారి ఆర్థికాభివృద్ధిపై ప్ర‌భుత్వం ప్ర‌త్యేక శ్రద్ధ చూపుతోంది.

 Kcr Is Once Again Using Ambedkar Sentiment., Kcr, Ambedkar Statue, Hussain Sagar-TeluguStop.com

ఇప్పుడు మ‌రో బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మాన్నిశ్రీకారం చూట్టాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించారు.భాగ్య‌న‌గ‌రం న‌డిబొడ్డున హుస్సేన్ సాగ‌ర్ తీరంలో సుమారు రూ.100 కోట్ల రూపాయ‌ల‌తో రాజ్యాంగ నిర్మాత‌, బీఆర్ అంబేద్క‌ర్ భారీ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయాల‌ని తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం సంక‌ల్పించింది.గ‌తంలో ఈ భారీ విగ్ర‌హ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ శంకుస్థాప‌న కూడా చేశారు.

అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని సుమారు 11 ఎక‌రాల విస్తీర్ణంలో 125 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యిచింది.

బీఆర్‌ అంబేద్క‌ర్ విగ్ర‌హం కింది భాగంలో 50 అడుగుల మేర పార్లమెంట్ ఆకృతిలో భ‌వ‌నం నిర్మించాల‌ని, దానిపైన అంబేద్క‌ర్ విగ్ర‌హం ఉంటుంద‌ని ప‌నులు ప‌రిశీలించిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ వివ‌రించారు.

ఈ విగ్ర‌హం నిర్మాణం 15 నెల‌ల‌లో పూర్తి చేస్తామ‌ని మంత్రి చెప్పారు.

రాజ్యంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్కర్ గొప్పదనాన్ని ప్రతిబింబించేలా నిర్మాణం ఉటుంది.

సువిశాలమైన స్థలంలో అంబేద్కర్ పార్కు కూడా ఏర్పాటు చేస్తామ‌ని మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ తెలిపారు.అంతేకాకుండా విగ్రహంతోపాటు మ్యూజియం లైబ్రరీ , అలాగే విగ్రహం వెడల్పు 45.5 ఫీట్లు ఉంటుందని ఆయ‌న వెల్ల‌డించారు.

Telugu Ambedkar Statue, Drbr, Hussain Sagar, Hyderabad, Kcr, Koppula Eeswar, Ts-

ఇండియాలోని గుజరాత్ లో ఇప్ప‌టికే బీజేపీ ప్ర‌భుత్వం నర్మదా నది ఒడ్డున ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో అతి పెద్ద విగ్ర‌హంగా ఉంది.అయితే ఇప్పుడు కేసీఆర్ నిర్మించే అంబేడ్క‌ర్ విగ్ర‌హం దానికంటే పెద్ద‌ది కాబోతోంది.ఇక ఇక్క‌డ ధ్యానమందిరం , లేజర్ షో క్యాంటీన్ లాంటివి కూడా ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది.

వీటితో పాటు స్కిల్స్ డెవలప్ మెంట్ వర్క్ షాపులు సెమినార్లు కూడా నిర్మించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.మొత్తానికి కేసీఆర్ త‌న వ్యూహంతో మ‌రోసారి దేశ వ్యాప్తంగా హైలెట్ కాబోతున్నార‌న్న మాట‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube