తన వ్యూహాలతో ప్రతిపక్షాలను ఇరుకున పెడుతున్న కేసీఆర్

కేసీఆర్ అంటే రాజకీయ వ్యూహాలలో దిట్ట అనే విషయం మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర లేదు.ఎంత పెద్ద అవాంతరాన్నైనా చాలా చాకచక్యంగా ఎదుర్కొంటాడనే విషయం మనకు తెలిసిందే.

 Kcr Is Narrowing Down The Opposition With His Tactics , Kcr, Trs Party, Telangan-TeluguStop.com

అయితే ఇప్పటికే తనదైన వ్యూహాలతో ప్రతిపక్షాలను ఇరుకున పెడుతున్న విషయం మనం గమనిస్తూనే ఉన్నాం.అయితే ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా కేసీఆర్ ని విమర్శిద్దామని ప్రతిపక్షాలు ఎదురుచూస్తాయనే విషయం మనకు తెలిసిందే.

ప్రస్తుతం తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ఎంతలా విజ్రుంభిస్తుందో మనం చూస్తున్నాం.సరైన సమయంలో ఆక్సీజన్ అందక కరోనా బాధితులు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి నెలకొంది.

అయితే దీనిని ఆసరాగా చేసుకొని కేసీఆర్ ను ఇరుకున పెడదామని ప్రయత్నిస్తున్న వారికి కేసీఆర్ అవకాశమే లేకుండా చేస్తున్నాడు.అయితే ఆక్సీజన్ కొరత విషయంలో యుద్ధ విమానాల్లో ఆక్సీజన్ దిగుమతికి ప్రయత్నించడం, అదే విధంగా ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్ నిర్ణయం తీసుకోవడంతో ప్రతిపక్షాలకు ఏమీ పాలుపోక మరో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నాయి.

ఏది ఏమైనా కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రతిపక్షాలకు దిక్కు తోచని స్థితిలోకి వెళ్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.ఈ విధంగా ఇలాగే కొనసాగితే మరల త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో క మరల టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube