కేంద్రం పై కేసీఆర్ యుద్దమే ? మమత రూట్ లోనే 

కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీపై పోరు మరింత తీవ్రం చేస్తేనే మళ్లీ తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడేందుకు అవకాశం ఉంటుందనే విషయాన్ని తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ డిసైడ్ అయిపోయారు .అందుకే గత కొద్ది రోజులుగా ఆయన తన వ్యూహాన్ని మార్చుకున్నారు.

 Kcr, Telangana, Bjp, Central Government, Modhi, Amith Sha, Mamatha Benarji, Tel-TeluguStop.com

  బీజేపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.కేంద్రంలో బిజెపి అనుసరిస్తున్న విధానాలపై గట్టిగానే విమర్శలు చేస్తున్నారు .తెలంగాణలో రైతులు ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని ఇబ్బందులకు కారణం కేంద్ర ప్రభుత్వమే అనే విషయాన్ని పదే పదే హైలెట్ చేస్తున్నారు.  అంతే కాదు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ధర్నా కార్యక్రమాలకు దిగుతున్నారు.

ఇక బిజెపి పై పోరు మరింత తీవ్రతరం చేసేందుకు కేసీఆర్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ గత ఎన్నికల్లో బీజేపీ పై వ్యవహరించిన తీరు కేసీఆర్ ను బాగా ఆకర్షించింది.

కేంద్రం విధానాలను తప్పు పట్టడమే కాకుండా ప్రధాని నరేంద్ర మోదీ,  అమిత్ షా వంటి వారి పై వ్యక్తిగత విమర్శలు చేశారు.  పూర్తిగా బీజేపీని ఇరుకున పెట్టే విధంగా వివిధ అంశాలను ప్రస్తావించి కేంద్రం పై విమర్శలు చేశారు.

పశ్చిమబెంగాల్లో మమతను ఓడించేందుకు బిజెపి ఎన్ని వ్యూహాలను అమలు చేసినా,  దానిని సానుభూతి రూపంలో మలచుకుని తమ పార్టీ విజయానికి మమత దోహదపడే విధంగా మమత చేసుకున్నారు.కేంద్రం ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మమత విజయాన్ని పశ్చిమబెంగాల్లో ఆపలేకపోయారు.

  అయితే ఇప్పుడు బీజేపీపై అదే రూట్లో వెళ్లాలని,  అలా వెళ్తేనే జనాల్లో టిఆర్ఎస్ కు ఆదరణ పెరుగుతోందనే విషయాన్ని కేసీఆర్ గుర్తించారు.

Telugu Amith Sha, Central, Mamatha Benarji, Modhi, Telanangana Cm, Telangana-Tel

కేంద్రం తీరు పై ప్రజలు పెరుగుతున్న వ్యతిరేకత ను మరింత రెచ్చగొట్టాలని , అలాగే టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఏర్పడిన వ్యతిరేకతను జాగ్రత్తగా కేంద్రం వైపుకు మళ్ళించాలనే వ్యూహం లో కెసిఆర్ ఉన్నట్టు ఆయన వ్యవహారాలను బట్టి అర్థమవుతోంది.దేశవ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం మూడు లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వబోతున్నట్లు కేసీఆర్ ప్రకటన చేయడానికి కారణం కేంద్రాన్ని ఇరుకున పెట్టడంతోపాటు, రైతులలోనూ టిఆర్ఎస్ పై ఆదరణ పెరిగేలా చేయడం,  దేశవ్యాప్తంగా టిఆర్ఎస్ కు మంచి గుర్తింపు వచ్చేలా చేసుకోవడం ఇవన్నీ కేంద్రాన్ని ఇరుకున పెట్టడం లో భాగంగానే అనే విషయం అర్ధం అవుతోంది.ఈ పరిణామాలతో తెలంగాణలో తమకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్న బీజేపీని సైతం ఎదుర్కునేందుకు అవకాశం ఏర్పడుతుంది అనే లెక్కల్లో కేసీఆర్ ఉన్నట్టు ఆయన వ్యూహాలను బట్టి అర్థం అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube