బిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ ( CM KCR )ఏం చేసినా అది పెద్ద సంచలనంగానే ఉంటుంది.వచ్చే ఎన్నికల్లో పార్టీని మూడోసారి అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు.
ఇప్పటికే క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులతో పర్యటనలు చేయిస్తూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.అలాగే నియోజకవర్గాల వారీగా సర్వేలు చేయిస్తూ , సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు ఏ వధంగా ఉంది, ప్రజల్లో వారికి ఏ స్థాయిలో ఆదరణ ఉంది అనే విషయం పైన ఆరా తీస్తున్నారు.
ఇక బిజెపి( BJP party ) కాంగ్రెస్ ,లకు చెక్ పెట్టేందుకు రకరకాల హామీలతో ఎన్నికల్లోకి వెళుతున్నాయి.ఇప్పటికే తమ తమ పార్టీల మేనిఫెస్టోలోని కొన్ని కొన్ని పథకాలను ప్రకటిస్తూ, ప్రజల చూపు తమ పార్టీపై పడేవిధంగా చేసుకుంటున్నారు.
అన్ని విషయాల్లో పై చేయి సాదించాలనే పట్టుదలతో ఉన్న బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.

అయితే ఈసారి బీఆర్ఎస్ ఎన్నికల( BRS party ) మేనిఫెస్టో లేకుండానే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.కొత్త మేనిఫెస్టోను ప్రకటిస్తే ఖచ్చితంగా కొత్త హామీలను ప్రకటించాల్సి వస్తుందని భావిస్తున్నారట.ఎప్పటికే రెండుసార్లు బీఆర్ఎస్ వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది.
పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని, వాటిని మరింత మెరుగ్గా అందిస్తామని ప్రజలకు వివరించగలిగితే సరిపోతుందనే లెక్కల్లో కేసీఆర్ ఉన్నారట.ఇదే విషయంపై పలు ఆర్థిక, సామాజిక రంగాల నిపుణులు సలహాలు కేసీఆర్ తీసుకుంటున్నట్లు సమాచారం.

రెండు సార్లు అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కొత్త హామీలను ఇవ్వడం కంటే ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలను కొనసాగిస్తామని చెబితే ప్రజలు సానుకూలంగానే స్పందిస్తారని అంచనా వేస్తున్నారట .ప్రస్తుతం కొత్త హామీలను ప్రకటించి అమలు చేస్తామని చెప్పినా ఆర్థికపరమైన ఇబ్బందులు దృష్ట్యా కొత్త మేనిఫెస్టోను ప్రకటించడం కంటే పాత వాటిని కొనసాగిస్తామని చెప్పి ఎన్నికలకు వెళ్లడం మంచిదని కేసీఆర్ భావిస్తున్నారట.