ఈ విధంగా బీఆర్ఎస్ ను హైలెట్ చేయబోతున్న కేసీఆర్

జాతీయస్థాయిలో బిఆర్ఎస్ ను బలోపేతం చేసే విషయంపై ఆ పార్టీ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.ఇప్పటికే తెలంగాణతో పాటు , తమకు బలం ఉన్న వివిధ రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

 Kcr Is Going To Highlight Brs In This Way Brs, Kcr, Telangana, Bjp, Parlament, T-TeluguStop.com

దేశవ్యాప్తంగా బిజెపి వ్యతిరేక పార్టీలన్ని తమకు మద్దతు ఇచ్చే విధంగా కేసీఆర్ చూసుకుంటున్నారు.దీనికోసం భారీగానే కసరత్తు చేస్తున్నారు.

జాతీయ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కలిసి వచ్చే ఏ చిన్న అవకాశాన్ని వదిలి పెట్టకుండా ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు.దీనికోసమే తాజాగా జరగబోయే పార్లమెంటు సమావేశాలను ఉపయోగించుకుని బీఆర్ఎస్ ప్రభావాన్ని పెంచాలని కేసీఆర్ భావిస్తున్నారు.

ఈనెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలు కేంద్రాన్ని టార్గెట్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాలని నిర్ణయించుకున్నారు.

Telugu Budget, Telangana-Politics

ఈ మేరకు బీఆర్ఎస్ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు .ఈ బడ్జెట్ సమావేశాల్లో ఏ అంశాలను లేవనెత్తాలి ఏ విధంగా వాటిపై బీజేపీని ఇరుక్కుని పెట్టాలి ? బడ్జెట్ కేటాయింపులు ,కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావలసిన నిధులు , కేంద్రం నెరవేర్చని విభజన హామీలతో పాటు,  ఇటీవల వివాదస్పదం అవుతున్న గవర్నర్ల వ్యవహారం పైన పార్లమెంట్ లో ప్రస్తావించాలని కెసిఆర్ నిర్ణయించారు.అలాగే తమతో కలిసి వచ్చే జాతీయ పార్టీలు అన్నిటిని కలుపుకుని పార్లమెంటు వేదికగా పోరాటానికి దిగాలని ఎంపీలకు సూచించారు.

దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ వైపు చూస్తున్న ప్రాంతీయ పార్టీలను ఈ పార్లమెంట్ సమావేశాల్లో మరింతగా ఆకర్షించి తమకు మద్దతు ఇచ్చే విధంగా చేసుకోవాలని నిర్ణయించారు.

Telugu Budget, Telangana-Politics

కేంద్ర బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు, అలాగే మార్చి 13 నుంచి ఏప్రిల్ ఆరో తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి.ఈ సమావేశాల్లోనే దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను తన వైపుకు తిప్పుకునే విధంగా కేసీఆర్ వ్యవహరచన చేస్తున్నారు.దీనిలో భాగంగానే పార్టీ ఎంపీలకు పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై తగిన సూచనలను కేసీఆర్ చేశారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube