ఆ విష‌యాల్లో జ‌గ‌న్‌ను ఫాలో అవుతున్న కేసీఆర్‌..

రాజకీయాల్లో ఎప్పుడూ ట్రెండ్ సెట్ చేయాల‌నే ప్ర‌తి ఒక్క రాజ‌కీయ నేత అనుకుంటారు.ఎవ్వ‌రూ ఊహించ‌న‌టువంటి ప‌థ‌కాల‌ను, విధానాల‌ను పాటిస్తే త‌ర‌త‌రాలు వారి పేర్లు గుర్తు పెట్టుకుంటారన్న‌ది వారి భావ‌న‌.

 Kcr Is Following Jagan In Those Matters Details, Kcr, Jagan, Anganwadi Schools,-TeluguStop.com

కేసీఆర్ కూడా ఇలా ట్రెండ్ సెట్ చేయాల‌నే ప్ర‌తిసారి అనుకుంటారు.రైతుబంధు, ద‌గ్గ‌రి నుంచి అనేక ప‌థ‌కాల‌ను కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టి ఓ ట్రెండ్ సెట్ చేశార‌నే చెప్పొచ్చు.

ఇక కేంద్ర ప్ర‌భుత్వం కూడా త‌మ ప‌థకాల‌నే కాపీ కొడుతోంద‌ని గ‌తంలో కేసీఆర్ అనేక సార్లు చెప్పుకొచ్చారు.అయితే ఎందుకో ఇప్పుడు ఆయ‌న జ‌గ‌న్‌ను ఫాలో అయిపోతున్నారు.

అదేంటి జ‌గ‌న్‌ను ఫాలో అవ్వాల్సిన అవ‌స‌రం కేసీఆర్‌కు ఏంట‌ని ఆశ్చ‌ర్య‌పోకండి.ఇందుకు కొన్ని కార‌ణాలు కూడా ఉన్నాయండి.

ఇప్పుడు తెలంగాణ‌లో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలను కేసీఆర్ పాఠశాలలు నిర్వ‌హిస్తున్న‌ విద్యాశాఖలో విలీనం చేసేందుకు నిర్ణ‌యించారు.ఇంత‌కు ముందు అంగ‌న్ వాడీ కేంద్రాల‌కు స‌రిగ్గా బిల్డింగులు లేక‌పోవ‌డంతో స్కూళ్ల ఆవ‌ర‌ణ‌లోనే నిర్వ‌హించేందుకు కేసీఆర్ డిసైడ్ అయ్యారు.

అయితే ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డానికి ఏపీలో ఇలాంటి నిర్ణ‌య‌మే గ‌తంలో జ‌గ‌న్ తీసుకోవ‌డంతో ఆ విధానాన్ని కేసీఆర్ గ‌వ‌ర్న‌మెంట్ ఫాలో అయిపోయింది.

Telugu Ap Cm Jagan, Cm Kcr, Jagan, Kcr Jagan, Kcr Schools, Schools, Telangana, T

ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 35,700 అంగన్‌వాడీ కేంద్రాలు న‌డుస్తున్నాయి.కాగా ఇందులో 15,167 అంగ‌న్ వాడీ కేంద్రాలు ఇప్పటికే ప్రైమ‌రీ స్కూళ్ల ఆవరణలో న‌డుస్తున్నాయి.మిగ‌తా 11,185 అంగ‌న్ వాడీ కేంద్రాలకు ఓన్ బిల్డింగులు ఉన్నాయి.12,219 మాత్రం ఇప్ప‌టికీ అద్దె బిల్డింగుల్లోనే ఉంటున్నాయి.ఇక వీట‌న్నింటినీ స‌మ‌న్వ‌యం చేయ‌డం ఇబ్బందిగా మారుతున్న త‌రుణంలో వాటిని స్కూళ్ల ఆవ‌ర‌ణ‌లోకి త‌ర‌లించ‌డం మంచిద‌ని కేసీఆర్ స‌ర్కార్ భావించింది.

ఇందుకు జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాన్ని అనుస‌రిస్తోంది.మ‌రి కేసీఆర్ ఇలా జ‌గ‌న్‌ను ఫాలో అవుతున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు ఏమైనా కామెంట్లు చేసే అవ‌కాశం కూడా లేక‌పోలేదు.ఏదేమైనా కేసీఆర్ గ‌వ‌ర్న‌మెంట్ నిర్ణ‌యం ఏ మేర‌కు ఫ‌లిస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube