ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతున్న కేసీఆర్...

తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తికరంగా మారిన పరిస్థితి ఉంది.ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఎండగడుతూ దీక్షల పేరిట, పాదయాత్రల పేరిట ప్రజల్లో ఉంటూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత సృష్టించడానికి ప్రయత్నం జరుగుతోంది.

 Kcr Is Careful Not To Create Opposition To The Government-TeluguStop.com

అయితే రోజురోజుకు ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకపడుతున్నా టీఆర్ఎస్ పార్టీకూడా గట్టిగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు.అయితే ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ సమాచారాన్ని తెప్పించుకుంటున్న కెసీఆర్ ప్రజల మూడ్ ప్రభుత్వంపై ఎలా ఉంది అనే దానిని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారు.

అయితే ఎంత ఇంటిలేజెన్స్ సమాచారాన్ని ఫాలో అయినా కొద్ది స్థాయి వ్యతిరేకతను ఆపడం కొద్దిగా కష్టమైన వ్యవహారం.అందుకే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కెసీఆర్.

అందుకు ఒకే ఒక ఉదాహరణ దళితబంధు.దళిత బంధు ప్రకటన తరువాత మిగతా కులాల వారు తమకు కూడా అదే పధకాన్ని వర్తింప చేయాలని పెద్ద ఎత్తున నిరసన తెలిపిన విషయం తెలిసిందే.

వెంటనే స్పందించిన కెసీఆర్ మిగతా కులాలకు బంధు పధకం వర్తింపచేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందని తెలిపారు.అందుకే కెసీఆర్ ప్రతి విషయంలో ఆచితూచి అడుగులేస్తున్న పరిస్థితి ఉంది.

మరి రానున్న రోజుల్లో కెసీఆర్ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తాడనేది చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube