వ‌రుస భేటీల‌తో ఢిల్లీలో కేసీఆర్ బిజీ.. ఆ మంత్రితోనే రెండోసారి చ‌ర్చ‌లు

ఢిల్లీ వేదికా ఇప్పుడు కేసీఆర్ మ‌రోసారి రాజ‌కీయాల‌ను వేడెక్కించేశారు.ఆయ‌న అనూహ్యంగా ఢిల్లీ వెళ్ల‌డంతో మ‌రోసారి ఈ వార్త‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

 Kcr Is Busy In Delhi With A Series Of Meetings  Discussions With That Minister F-TeluguStop.com

ఓ వైపు రాష్ట్రంలోని బీజేపీ నేత‌లు ఏం జ‌రుగుతుందో అని త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.ఇక ఈ నెల‌లోనే రెండోసారి ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ వ‌రుస‌బెట్టి కేంద్ర మంత్రుల‌ను క‌లుస్తున్నారు.

ఇన్నిసార్లు ఆయ‌న‌కు ముఖ్య‌మైన కేంద్ర‌మంత్రుల అపాయింట్‌మెంట్ ఎలా దొరికింద‌నే విష‌జ్ఞం ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.కేసీఆర్‌కు ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు అండ‌గా ఉంటున్నార‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది.

అయితే కేసీఆర్ మాత్రం కేంద్ర జలవనరులశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తోనే రెండోసారి భేటీ కావ‌డం గ‌మ‌నార్హం.ఈ నెల‌లోనే ఆయ‌న‌తో కేసీఆర్ రెండుసార్లు ప్రాజెక్టుల విష‌యంలోనే స‌మావేశం అవుతున్నారు.

సెప్టెంబ‌ర్ నెల 6న కేంద్ర జలవ‌న‌రుల శాఖ మంత్రి షెకావ‌త్‌తో మీటింగ్ నిర్వ‌హించిన కేసీఆర్ అప్పుడు 5 అంశాలపై విన‌తిప‌త్రాన్ని ఇచ్చారు.ఇక రెండోసారి భేటీలో కూడా ఇవే అంశాల‌పై చర్చకు వచ్చినట్టుగా స‌మాచారం.

దాదాపుగా 40 నిమిషాల పాటు కృష్ణా జలాల వాటా విష‌యంపైనే చ‌ర్చ సాగిన‌ట్టు తెలుస్తోంది.

Telugu Kcrbusy, Palamuru, Ranga, Ts-Telugu Political News

ఇక తెలంగాణ‌లో క‌ట్టిన‌టువంటి పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమ‌తుల‌తో పాటు గోదావ‌రి నది మీద ఉన్న‌టువంటి 11 ప్రాజెక్టుల విష‌యంలో కేంద్రం ఇదివ‌ర‌కే ఇచ్చిన గెజిటి నోటిఫికేషన్ పై చ‌ర్చించారంట‌.ఇందులో త‌మ ప్రాజెక్టుల‌కు అనుమతుల్లేవ‌ని చెప్ప‌డం స‌రికాద‌ని, నిబంధ‌న‌ల‌కు లోబ‌డే ఆ ప్రాజెక్టులు క‌ట్టిన‌ట్టు కేసీఆర్ వెల్ల‌డించ‌రంట‌.కేంద్ర జలసంఘం కూడా ఇప్ప‌టికే ప‌ర్మిష‌న్ ఇచ్చిందని గుర్తుచేశారు.

ఇక ఇదే స‌మ‌యంలో ఏపీ క‌డుతున్న ప్రాజెక్టుల‌పై కూడా ఫిర్యాదు చేసిన‌ట్టు తెలుస్తోంది.దీంతో వ‌రుస భేటీల‌తో ఇటు తెలంగాణ బీజేపీ నేత‌ల‌ను అటు జ‌గ‌న్ స‌ర్కారుకు కేసీఆర్ ఝ‌ల‌క్ ఇస్తున్నార‌న్న‌మాట‌.

చూడాలి మ‌రి దీనిపై బీజేపీ నేత‌లు ఏం చెబుతారో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube