కేంద్ర బీజేపీకి కోపం తెప్పిస్తున్న కేసీఆర్.. బండికి క‌లిసొచ్చే అంశ‌మా..

రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు, శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌ర‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం.కేవ‌లం అవ‌స‌రాల‌ను బ‌ట్టి శ‌త్రువులు మిత్రులు అవుతుంటారు.

 Kcr Is Annoying The Central Bjp..what Is The Purpose Of The Bandi Sanjay Bandi S-TeluguStop.com

ఈ విష‌యం కేసీఆర్‌కు, బీజేపీకి తెలియ‌నిది కాదు.ఇన్ని రోజులు కేంద్ర బీజేపీ నాయ‌క‌త్వం కేసీఆర్ ను సీరియ‌స్‌గా తీసుకోలేద‌నే చెప్పాలి.

ఎందుకంటే భ‌విష్య‌త్‌లో త‌మ‌కు కేసీఆర్‌తో అవ‌స‌రం ఏర్ప‌డుతుంద‌నే ఆలోచ‌న‌తోనే బీజేపీ కేంద్ర నాయ‌క‌త్వం ఇన్ని రోజులు కేసీఆర్‌తో క‌య్యానికి పోలేదు.ఇందుకు కార‌ణం కేంద్రంలో తిరిగి బీజేపీ అధికారంలోకి రావాల‌నే ప్లాన్‌.

అయితే కేసీఆర్ మాత్రం ఇన్ని రోజులు కాస్త కేంద్ర నాయ‌క‌త్వానికి అనుకూలంగా న‌డుచుకున్నా కూడా హుజూరాబాద్ ఎఫెక్ట్ తో రూటు మార్చారు.ఏకంగా ఆయ‌నే రంగంలోకి దిగిపోయారు.

బండి సంజయ్ ని ఓ రేంజ్ లో చెడుగుడ ఆడేసుకున్నారు.ఇదే క్ర‌మంలో కేంద్ర బీజేపీ నాయ‌క‌త్వాన్ని కూడా తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు.

బీజేపీ సర్కారు చేస్తున్న ప‌నుల‌పై పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు చేశారు.ఇక కేంద్రంతో క‌య్యానికి కాలు దువ్వారు.

వ‌డ్ల కొనుగోళ్ల కోసం నియోజ‌క‌వ‌ర్గాల్లో ధ‌ర్నాలు చేశారు.అంతే కాదు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా గ‌ళం వినిపిస్తామంటున్నారు.

Telugu Bandi Sanjay, Kcrcentral, Tg-Telugu Political News

దీంతో ఇన్ని రోజులు మోడీ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించ‌గా.ఇప్పుడు మాత్రం రూటు మార్చుతున్న‌ట్టు తెలుస్తోంది.భ‌విష్య‌త్ రాజ‌కీయాల్లో క‌లిసి వ‌స్తారో రారో తెలియ‌ని కేసీఆర్ ను ఇలాగే వ‌దిలేస్తే ప్ర‌స్తుతం త‌మ పార్టీ ఇమేజ్ ఇటు తెలంగాణ‌లో, అటు దేశంలోనూ దెబ్బ తింటుంద‌ని మోడీ, అమిత్ షాలు భావిస్తున్నారంట‌.

ఇప్ప‌టికే బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజ‌య్‌కు ఈ మేర‌కు ఆదేశాలు కూడా ఇచ్చారంట‌.బండికి ఫుల్ ఫ్రీడ‌మ్ ఇచ్చి, పూర్తి స్థాయిలో కొట్లాడేందుకు అవ‌కాశం ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.

త‌మ వంతుగా పూర్తి స‌హాయ‌, సహ‌కారాలు అందిస్తామ‌ని కేంద్ర నాయ‌క‌త్వం సూచించిన‌ట్టు స‌మాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube