'ఫామ్ హౌస్ రాజకీయం' ఎవరికీ అంతుపట్టడంలేదా ...?  

కేసీఆర్ ! తెలంగాణ ముఖ్యమంత్రిగా చాలా బిజీ బిజీగా ఉంటారు. అయితేనేమి ఆయనకు వ్యవసాయం అంటే ఎంతో మక్కువ. అందుకే ప్రగతి భవన్ కంటే ఎక్కువ ఫామ్ హౌస్ లోనే ఆయన ఉంటారు. అక్కడి నుంచే ఏ రాజకీయం అయినా చేస్తూ ఉంటారు. ఇప్పుడు కేసీఆర్ అత్యవసరంగా చేయాల్సిన పని ఏదైనా ఉందా అంటే అది మంత్రి వర్గ విస్తరణ, లోక్ సభ అభ్యర్థుల ప్రకటన, 16 మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన మిగిలి ఉంది. అయితే కేసీఆర్ ప్రకటన ఎప్పుడు ఉండబోతోంది అనే విషయంలో అంతా ఆసక్తిగా … ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ లోపునే ఈ నెల 17 న కేసీఆర్ పుట్టినరోజు కూడా కావడంతో ఆ తేదీ లోపునే కేసీఆర్ నుంచి ఏదో ఒక ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్టు ఆసవ్వాహులు ఎదురుచూపులు చూస్తున్నారు.

KCR In Yerraballi Farm House For Telangana Politics-Kcr Form Politics Governament

KCR In Yerraballi Farm House For Telangana Politics

అసలు కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్ లో మకాం వేయడం … ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే విషయం ఎవరికీ అంతుపట్టడంలేదు. అదీకాకుండా… త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని స్వయంగా చెప్పిన కొద్ది గంటల్లోనే ఆయన ఎర్రవల్లిలోని తన ఫాంహౌజ్‌కు రావడం ఆసక్తి కలిగిస్తోంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలోని ఎర్రవల్లి ఫాంహౌజ్‌ అంటే సీఎం కేసీఆర్‌కు సెంటిమెంట్‌. ఏ పనినైనా ఇక్కడి నుంచి శ్రీకారం చుడితే విజయవంతమవుతుందని బాగా నమ్మకం. ఇదే విషయాన్ని అనేక సార్లు కేసీఆర్ కూడా ప్రస్తావించారు. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం అంతా ఫార్మ్ హౌస్ చుట్టూనే సాగుతున్నాయి. అక్కడ తీసుకున్న నిర్ణయాలు సక్సెస్ అవుతున్నాయని కేసీఆర్ బలంగా నమ్మడమే కారణం.

KCR In Yerraballi Farm House For Telangana Politics-Kcr Form Politics Governament

తెలంగాణాలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి చాలా కాలమే అయ్యింది. కాకపోతే ముహుర్తాలు… సెంటిమెంట్స్ అంటూ… వాయిదాలు వేస్తూనే వస్తున్నారు. ఇప్పటివరకు కేసీఆర్ తో పాటు హోమ్ మంత్రిగా మహమూద్ అలీ మాత్రమే ప్రమాణస్వీకారం చేశారు. ఇంకా…. 16 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంది. అలాగే, రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలు ఉండగా హైదరాబాద్‌ మినహా మిగతా 16 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను బరిలో దించబోతున్నారు. అదేవిధంగా… పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా త్వరలోనే జరగబోతున్నాయి. వీటికి సంబంధించి టీఆర్‌ఎస్‌ తరపున అభ్యర్థులను అలాగే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కసరత్తు మొత్తం ఫామ్ హౌస్ లోనే పూర్తి చేసి కొద్దీ రోజుల్లోనే ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.