యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో కేసీఆర్ దంప‌తుల పూజ‌లు.. !

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈరోజు యాదాద్రి పర్యటనలో ఉన్నారు.కాగా త్వరలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్న నేపధ్యంలో సీఎం కేసీయార్ నరసింహ స్వామివారిని దర్శించుకోవడం, ఈ ఎన్నికల్లో కూడా తమ అభ్యర్ధులు గెలిచేలా చూడమని నరసింహ స్వామివారిని కోరుకుంటున్నారు కావచ్చని అనుకుంటున్నారట కొందరు ప్రతిపక్షాల వారు.

 Kcr In The Presence Of Yadadri Srilakshmi Narasimha-TeluguStop.com

ఇకపోతే యాదాద్రి దర్శించడం తెలంగాణ ముఖ్యమంత్రికి కొత్తేమి కాదు.ఎందుకంటే 2016లో కేసీఆర్ యాదాద్రి పున‌ర్నిర్మాణ పనులను ‌ప్రారంభించిన విష‌యం తెలిసిందే.

అప్పటి నుండి తరచుగా ఈ ఆలయ నిర్మాణ పనులను స్వయంగా కేసీయార్ పరిశీలించడం జరుగుతుంది.

ఇక ఈ శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆల‌యాన్ని 4.33 ఎకరాల్లో గోపురాలు, ప్రాకారాలు, దశావతారాలు వంటి అనేక విశిష్ట‌ల‌త‌ల‌తో తీర్చిదిద్దుతున్నారు.కాగా, స్వామి వారి ద‌ర్శ‌నం అనంత‌రం కేసీఆర్ అక్క‌డి అభివృద్ధి పనులను ప‌రిశీలిస్తుండటం తెలిసిందే.

ఈ క్రమంలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి పూజలో కేసీఆర్ దంప‌తులు పాల్గొన్నారు.అంత‌కు ముందు కేసీఆర్‌ని అర్చకులు పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు.దర్శనం అనంతరం అర్చకులు ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

#Visits #CM KCR #Narasimha Swamy #Yadadri #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు