లక్ష మందితో లక్ష్యం నెరవేర్చుకోబోతున్న కేసీఆర్ ?

తెలంగాణ సీఎం కేసీఆర్ పెద్ద లక్ష్యంతోనే ముందుకు వెళ్తున్నారు.రెండోసారి టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది అంటే కేసీఆర్ ముందుచూపే కారణం.

 Kcr In The Idea Of A Dalit Bandhu Sabha With One Lakh People-TeluguStop.com

మూడోసారి తమకు తిరుగులేకుండా చేసుకునేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.అంతకంటే ముందుగా ఉప ఎన్నికల్లో సత్తా చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఒకవైపు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా పెరిగిపోయింది అన్న నివేదికలు వస్తుండడంతో, ముందుగానే కెసిఆర్ అలెర్ట్ అయ్యారు.మొన్నటివరకు ఫామ్ హౌస్ రాజకీయాలకే పరిమితం అయిపోయిన కేసీఆర్, ఇప్పుడు మాత్రం జనం బాట పడుతున్నారు.

 Kcr In The Idea Of A Dalit Bandhu Sabha With One Lakh People-లక్ష మందితో లక్ష్యం నెరవేర్చుకోబోతున్న కేసీఆర్ -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతూ, జిల్లాల వారీగా పర్యటనలు చేస్తున్నారు.ఇక హుజురాబాద్ లో ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్నో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు.

దళిత బందు పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి ,దళితులకు మేలు చేసే విధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఈ పథకాన్ని ఈనెల 16 న హైదరాబాద్ లోనే కేసీఆర్ ప్రారంభించనున్నారు.

దళిత బంధు ద్వారా టిఆర్ఎస్ కు క్రెడిట్ రాకుండా చేసేందుకు రాజకీయ ప్రత్యర్థులు ప్రయత్నిస్తుండటంతో, ఈ నెల 16న జరగబోయే భారీ బహిరంగ సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేయాలని నిర్ణయించుకున్నారు.హుజూరాబాద్ మండలంలోని తాళ్లపల్లి ఇందిరానగర్ గ్రామాల మధ్య లక్ష మంది దళితులతో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు కేసీఆర్ ఏర్పాట్లు చేస్తున్నారు.

లక్ష మందితో ఈ సభను సక్సెస్ చేయగలిగితే టిఆర్ఎస్ సత్తా అర్థమవుతుందని, పరిస్థితుల్లో మార్పు వస్తుందని అభిప్రాయపడుతున్నారు.అందుకే ఈ సభ నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, హరీష్ రావు తదితరులకు ఈ సభను సక్సెస్ చేసే బాధ్యతను కేసీఆర్ అప్పగించారు.ఈ దళిత బంధు పథకం ద్వారా ఈ నియోజకవర్గంలో మొత్తం 20929 కుటుంబాలకు చెందిన వారికి పది లక్షల మేర ఉపాధి కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పుడు ఆ కుటుంబాల వారు ఈ సభకు తరలి వచ్చేలా , ప్రణాళికలు రచిస్తున్నారు.లక్ష మందితో సభను సక్సెస్ చేసి హుజురాబాద్ లో తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలనే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు.

.

#Etela Rajendar #Hujurabad #Hareeshrao #Koppula Eswar #DalithaBandu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు