దళిత బంధు పధకంపై కేసీఆర్ ఆశలు...ప్రజలు ఆహ్వానించేనా?

కేసీఆర్ ఒక పధకం ప్రవేశపెట్టాడంటే ఆ పధకం ప్రకటన వెనుక తెరవెనుక వ్యూహం వేరేలా ఉంటుంది.చాలా మందికి అర్ధం కావడం చాలా కష్టం.

 Kcr Hopes On Dalit Bandhu Scheme Will People Invite Kcr, Dalith Bandhu Scheme, T-TeluguStop.com

తల పండిన రాజకీయ నాయకులే కేసీఆర్ వ్యూహాల్ని ప్రశంసించారంటే కేసీఆర్ వ్యూహాలకు ఉన్న బలం ఏంటో మనం అర్ధం చేసుకోవచ్చు.అయితే గత అసెంబ్లీ సమావేశాలలో ప్రతిపక్షాలను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇంకా తెలంగాణ ప్రజలకు గుర్తుండే ఉంటాయి.

అప్పుడు కేసీఆర్ ఏమని వ్యాఖ్యానించాడంటే మా దగ్గర ఉన్న ఓ పధకాన్ని ప్రవేశపెడితే ఇక ప్రతిపక్షాల అడ్రస్ లు గల్లంతావుతాయని వ్యాఖ్యానించారు.

Telugu @cm_kcr, @trspartyonline, Dalith Bandhu, Telangana-Political

అప్పుడు కేసీఆర్ అన్న పధకమే దళిత బంధు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.అయితే ఈ పధకాన్ని ఎన్నికలకు సరిగ్గా ఒక సంవత్సరం ముందు ప్రకటించాలని భావించినా ఇక హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయమే సరైన సమయమని కేసీఆర్ భావించి ఇప్పుడే దళితబంధును ప్రకటించారు.అయితే ఇప్పుడు తెలంగాణ ప్రజల దృష్టి అంతా దళిత బంధుపై పడింది.

ఇప్పటికే దళితబంధు నిధులను కొంత మేర లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిన విషయం తెలిసిందే.ఏది ఏమైనా కేసీఆర్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయాన్ని సైతం ఈ పధకంపైనే కేసీఆర్ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

మరి దళిత బంధు పధకం టీఆర్ఎస్ కు ఎంత మేర లాభం చేకూరుస్తుందనేది చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube