మేనల్లుడికి కేసీఆర్ మేలు చేస్తారా ? అక్కడ ఏం చెప్పబోతున్నారు ?  

Kcr Help In Harish Rao-

టిఆర్ఎస్ పార్టీలో కెసిఆర్,కేటీఆర్ కు ఎంత ప్రాధాన్యం ఉందో, అంతే స్థాయిలో కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావుకు ప్రాధాన్యం ఉంది అనే విష్యం ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.అయితే రెండోసారి అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక హరీష్ రావుకు మొండిచేయి చూపింది.

Kcr Help In Harish Rao--Kcr Help In Harish Rao-

కేటీఆర్ ను ప్రమోట్ చేసే ఉద్దేశంతో క్రమంగా హరీష్ రావు ప్రాధాన్యత తగ్గిస్తూ కేసీఆర్ వ్యూహం పన్నాడని పార్టీలోనూ చర్చ జరిగింది.అయితే దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడం, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెనింగ్ సందర్భంగా మొదటి నుంచి కష్టపడ్డ హరీష్ రావు కు ఆహ్వానం అందక పోవడం తో టిఆర్ఎస్ ప్రభుత్వం పై వ్యతిరేకత వ్యక్తం అయింది.

హరీష్ రావు బాసటగా సోషల్ మీడియాలో ను పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది.

ఇక ప్రస్తుతం రెండోసారి తన క్యాబినెట్ ను విస్తరించాలని చూస్తున్న కెసిఆర్ ఈ మంత్రివర్గ విస్తరణలో హరీష్ రావుకు ప్రాధాన్యం కల్పిస్తారని అంతా భావిస్తున్నారు.ఆయనకు నీటిపారుదల శాఖ ఇస్తారని కొందరు, లేదు విద్యాశాఖ అని మరికొందరు ఇలా ఎవరికి వారు ఊహాగానాల్లో ఉన్నారు.

అయితే హరీష్ విషయంలో తాను ఏమి చేయబోతున్నానో అనే విషంపై తన సొంత గ్రామంలోని స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం కేసీఆర్ తన సొంత ఊరైన చింతమడకలో పర్యటించేందుకు సిద్ధం అవుతున్నారు.దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

కేసీఆర్ ఆ పర్యటన సందర్భంగా ఒక రోజంతా ఆ గ్రామంలో ఉండబోతున్నారు.ఈ సందర్భంగా కెసిఆర్ ఏ అంశాల గురించి మాట్లాడబోతున్నారు అనే విషయంలో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.చింతమడకలో కెసిఆర్ హరీష్ రావు గురించి మాట్లాడితే బాగుంటుందని పార్టీలోని కొంతమంది చర్చించుకుంటున్నారు.

హరీష్ రావు ను కేబినెట్లోకి తీసుకోబోతున్నామని కేసీఆర్ తప్పకుండా ప్రకటించే అవకాశం ఉందని కేసీఆర్ సన్నిహితులు కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.