హరీష్ రావు హవా .. కేసీఆర్ వ్యూహం ? కేటీఆర్ సైలెన్స్ ?

తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ లో సీన్ రివర్స్ అయినట్టుగా కనిపిస్తోంది.ఈటెల రాజేందర్ టిఆర్ఎస్ కు రాజీనామా చేయక ముందు మంత్రి హరీష్ రావుకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పెద్దగా ప్రాధాన్యం కనిపించేది కాదు.

 Kcr Has Given Priority To Hareesh Rao In Trs, Kcr, Trs, Telangana, Hareesh Rao,-TeluguStop.com

మొత్తం కేటీఆర్ కేంద్రంగానే అన్ని వ్యవహారాలు నడిచేవి.అలాగే కేటీఆర్ సీఎం కాబోతున్నారనే ప్రచారం సాగింది.

దీనికి తగ్గట్టుగానే మంత్రి వర్గ ప్రక్షాళన చేపట్టి కేటీఆర్ కు అనుకూలమైన వ్యక్తులను మంత్రివర్గంలో నియమించాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు ఈ వ్యవహారాలు ఇలా  సాగుతుండగానే అనూహ్యంగా ఈటెల రాజేందర్ ను మంత్రి పదవి నుంచి తప్పించడం , ఆయన బిజెపిలో చేరడం హుజురాబాద్ ఉప ఎన్నికలు అనివార్యం కావడం , ఇలా ఎన్నో పరిణామాలు జరిగాయి.దీంతో అనూహ్యంగా కేటీఆర్ సైలెంట్ అయిపోయారు.

హరీష్ రావు కు హుజురాబాద్ బాధ్యతలు కేసీఆర్ అప్పగించడం తో పాటు,  తన తరువాత హరీష్ రావు కే ప్రాధాన్యం అన్నట్లుగా కెసిఆర్ వ్యవహరిస్తున్నారు.ప్రభుత్వ, పార్టీ వ్యవహారాల్లో హరీష్ రావు జోక్యం ఎక్కువ అయ్యేలా చేశారు.

ఆయనే వివిధ శాఖల అధికారులతో సమీక్షలు చేస్తూ, గతంలో కేటీఆర్ నిర్వహించిన అన్ని వ్యవహారాలను ఇప్పుడు హరీష్ రావు చూస్తున్నారు.
 

Telugu Etela Rajender, Etela Kcr, Hareesh Rao, Hujurabad, Huzurabad, Ktr Cm, Tel

కేటీఆర్ కేవలం తన నియోజకవర్గానికి పరిమితమైనట్లు గా వ్యవహరిస్తున్నారు.పార్టీకి సంబంధించిన ప్రకటనలు గాని, ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించిన వ్యవహారాల్లో తాను జోక్యం ఏమీలేదు అన్నట్లుగానే పూర్తిగా సైలెంట్ అయిపోయారు.అప్పుడప్పుడు మాత్రమే ఏదైనా విషయంపై స్పందిస్తున్నారు తప్ప ఎక్కువగా సైలెంట్ గా ఉండి పోతున్నారు.

అయితే దీనంతటికీ కారణం హుజురాబాద్ లో ఉప ఎన్నికలు త్వరలోనే ఉండడం. 

Telugu Etela Rajender, Etela Kcr, Hareesh Rao, Hujurabad, Huzurabad, Ktr Cm, Tel

  కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు కేసీఆర్ మిగతా వారందరికీ ప్రాధాన్యం తగ్గించి ఉద్యమకారులను బయటకు పంపిస్తారని , హరీష్ రావు క ఎన్నో అవమానాలు పార్టీలో జరిగాయంటూ ఈటెల రాజేందర్ విమర్శలు చేయడం, తదితర కారణాలతో కెసిఆర్ వ్యూహాత్మకంగా కేటీఆర్ సైలెంట్ చేసినట్లు తెలుస్తోంది.రాజేందర్ విమర్శలకు చెక్ పెట్టే విధంగా హరీష్ రావు కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ,  ఆయనతోనే రాజేందర్ పై విమర్శలు చేయిస్తున్నట్లు గా కనిపిస్తున్నారు.కారణాలు ఏదైనా కేటీఆర్ సైలెంట్ అవడం హరీష్ రావుకు గతంలో ఉన్న ప్రాధాన్యం ఇప్పుడు మళ్లీ కనిపించడం వంటి వ్యవహారాలు హరీష్ అనుచరుల్లో ఆనందాన్ని కలిగిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube