చిన్నవాడివైనా నీ మనసు పెద్దదయ్యా.! కేసీఆర్ మనవడు చేసిన ఆ పనిని ప్రశంసించకుండా ఉండలేరు.!  

రోడ్డు ప్రమాదంలో గాయపడి 12 ఏళ్లుగా ఇంటికే పరిమితమైన ఓ దివ్యాంగుడి విషయంలో సీఎం కేసీఆర్‌ మనవడు హిమాన్షు విషయంలో స్పందించి మానవత్వం చాటుకున్నారు. అంతేకాదు, తాత కేసీఆర్‌తో మాట్లాడి బాధితుడికి పూర్తి స్థాయిలో సాయం అందించాలని నిర్ణయించుకున్నారు.తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అతడికి మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకున్నారు. వివరాలలోకి వెళ్తే..

KCR Grandson Himanshu Helps Accident Victim-Himanshu Victim Kcr

KCR Grandson Himanshu Helps Accident Victim

భద్రాచలంలోని రాజీవ్‌నగర్‌లో ఉంటున్న నూకసాని శ్రీనివాస్‌ రావుకు రోడ్డు ప్రమాదంలో వెన్నుపూసకు తీవ్ర గాయమైంది. చాలాకాలం మంచానికే పరిమితమై.. కొన్నేళ్లుగా ట్రై సైకిల్‌పై తిరుగుతున్నాడు. ఇటీవల కేసీఆర్‌ గురించి శ్రీనివా్‌సరావు ‘‘దివ్యాంగుల పాలిట కేసీఆర్‌ దేవుడు.. 3 వేల ఫింఛనును ఆయన ఇవ్వకున్నా పర్వాలేదు. ఆకలి తీర్చేందుకు ఇప్పుడిస్తున్న మొత్తం సరిపోతోంది. ఆయనే మళ్లీ అధికారంలోకి రావాలి’’ అన్న మాటలను ఓ యూ ట్యూబ్‌ చానల్లో హిమాన్షు చూశారు.

KCR Grandson Himanshu Helps Accident Victim-Himanshu Victim Kcr

శ్రీనివాసరావు వివరాలు తెలుసుకుని వారి కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. అతడికి మెరుగైన వైద్యం అందించేందుకు తమకు తెలిసినవారిని పురమాయించాడు. దీంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో అతడికి చికిత్స అందుతోంది. హిమాన్షు చిన్నవాడైనా పెద్దమనసు ఉందంటున్నారు శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు. హిమాన్షు తమతో ఫోన్లో మాట్లాడి భరోసా ఇచ్చారని తెలిపారు. ఒకవేళ భద్రాచలంలో కాకుండా ఇంకా మెరుగైన వైద్యం అందించాల్సి వస్తే తాతయ్య కేసీఆర్ తో మాట్లాడి హైదరాబాద్ కు తరలిస్తామని చెప్పాడట.