గోల్డ్ మెడల్ సాధించిన కేసీఆర్ మనవడు..! ఇంతకీ ఎందులోనో తెలుసా.?

గతంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి 12 ఏళ్లుగా ఇంటికే పరిమితమైన ఓ దివ్యాంగుడి విషయంలో సీఎం కేసీఆర్‌ మనవడు హిమాన్షు విషయంలో స్పందించి మానవత్వం చాటుకున్నారు.అంతేకాదు, తాత కేసీఆర్‌తో మాట్లాడి బాధితుడికి పూర్తి స్థాయిలో సాయం అందించాలని నిర్ణయించుకున్నారు.

 Kcr Grandson Himanshu Gets Gold Medal-TeluguStop.com

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అతడికి మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకున్నారు.తాజాగా డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమెరికా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ సంస్థ నిర్వహించిన బెహతర్‌ ఇండియా క్యాంపెయిన్‌ పర్యావరణ విభాగంలో హైదరాబాద్‌ ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ విద్యార్థి అయిన హిమాన్షు గోల్డ్ మెడల్ సాధించాడు.

తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.

వివరాల లోకి వెళ్తే.బెహతర్‌ ఇండియా క్యాంపెయిన్‌ గ్రాండ్‌ ఫినాలే సందర్భంగా గురువారం ఢిల్లీలో క్యాంపెయిన్‌ బ్రాండ్‌ అంబాసిడర్, సినీ నటి పరిణితీ చోప్రా చేతుల మీదుగా పతకాలను ప్రదానం చేశారు.ఖాజాగూడలోని ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ 34,137 కిలోల రీసైకిలబుల్‌ వేస్ట్‌ను సేకరించి పాఠశాలల విభాగంలో మూడో స్థానంలో నిలిచింది.

వ్యక్తిగత విభాగంలో పతకం సాధించిన హిమాన్షును డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమెరికా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఎండీ అనూప్‌ పెబ్బీ ప్రత్యేకంగా అభినందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube