ఎలక్ట్రిక్ వాహనాలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన కేసీఆర్ సర్కార్..!!

తెలంగాణ రాష్ట్రాన్ని కాలుష్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కేసీఆర్ సర్కార్ ముందునుండి కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి నియంత్రించటానికి రాష్ట్రవ్యాప్తంగా హరితహారం పేరుతో భారీ స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమం ఇప్పటికే స్టార్ట్ చేసిన కేసీఆర్ సర్కార్ తాజాగా మరొక సరికొత్త నిర్ణయం తీసుకుంది.

 Kcr Govt Announces Bumper Offer For Electric Vehicles  Telangana,kcr,harithahara-TeluguStop.com

మేటర్ లోకి వెళ్తే డీజిల్ మరియు పెట్రోల్ ద్వారా నడిచే వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను ఎవరైతే రాష్ట్రంలో ప్రోత్సహిస్తారు వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది.

మేటర్ ఏమిటంటే తెలంగాణ రాష్ట్రంలో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్లు గాని రోడ్ టాక్స్ లు గాని కట్టాల్సిన అవసరం లేదని ప్రకటించింది.

ఇందుకుగాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది.ఆ ఉత్తర్వుల ప్రకారం తొలి 2 లక్షల ఎలక్రిక్ట్ ద్విచక్ర వాహనాలకు 100 శాతం రోడ్ ట్యాక్స్ ఫ్రీ తో పాటు, రిజిస్ట్రేషన్‌ కూడా ఫ్రీగా కల్పిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఒక్క ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మాత్రమే కాక ఇతర ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా ఈ ఆఫర్ వర్తించనుంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube