తెలంగాణ ముఖ్యమంత్రి ఎప్పుడు ఏది మాట్లాడిన సంచలనమే.ఎందుకో తెలుసా? ఆయన పేదల “మనీ”షి కాబట్టి.అందుకే తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఇక్కడి ప్రజలందరు బంగారు తెలంగాణాను చూసి మురిసిపోతున్నారట.అవినీతి రహిత తెలంగాణ ఎందరికో ఆదర్శంగా నిలిచిందట.ఆ ఏం చెబుతున్నారండీ కాకమ్మ కబూర్లు అని అనుకుంటున్నారా ఈ ముచ్చట్లు విని.కంటికి కనిపించని అభివృద్ధిని మనస్సులో తలచుకుని తృప్తిపడటం మన తెలంగాణ ప్రజలకు అలవాటైందట అందుకే ఈ విధంగా చెప్పుకుంటూ ఆనందిస్తున్నారట.
ఇక అసలు విషయం ఏంటంటే నల్లగొండ జిల్లా హాలియా బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్ కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలకు త్వరలో పెన్షన్లు ఇస్తామని ప్రకటించారట.కొత్త రేషన్ కార్డులు కూడా మంజూరు చేస్తామని వెల్లడించారట.
ఇంకేంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇది గుడ్ న్యూస్ కదా!.నిజానికి లోకంలో ఓట్లమ్ముకునే వారి కంటే పెద్ద బిచ్చగాళ్లూ ఎవరు ఉండరనే విషయం ఇంకా మన పిచ్చి ప్రజలకు తెలియనట్లుగా ఉంది.
అందుకే అప్పుడప్పుడు నాయకులు ఇలా అత్తరు పన్నీరు చల్లి అధికారాన్ని పూర్తిగా అనుభవిస్తున్నారని కడుపు కాలుతున్న కొందరు విద్యావంతులు అనుకుంటున్నారట.