రేవంత్ కి షాక్ ల మీద షాక్ ఇస్తున్న కేసీఆర్   KCR Giving Another Shock To Revanth Reddy     2017-10-24   23:37:32  IST  Bhanu C

రేవంత్ రెడ్డి ఇంకా పార్టీ మారనే లేదు..షాకుల మీద షాకులు ఇస్తున్నారు కేసీఆర్.. రేవంత్ ని తన నియోజకవర్గంలో ఒంటరిని చేయాలనీ కేసీఆర్ ప్రయత్నం ఫలిస్తోంది..మొన్నటికి మొన్న..కొంతమంది కొడంగల్ కి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు నేతలు ఇప్పటికే టీఆర్ఎస్ కండువా కప్పుకుంటే…తాజాగా ఇప్పుడు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి మహేందర్ రెడ్డి సమక్షంలో కొడంగల్, దౌల్తాబాద్‌కు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్‌లో చేరారు..కాంగ్రెస్ లో చేరే ముందు తన అనుచర గణంతో ఒకేసారి భారీ వలసలతో టిటిడి నుంచీ కాంగ్రెస్ లోకి వెళ్ళాలి అని భావించిన..రేవంత్ కి ఇదిఊహించని పరిణామం అనే చెప్పాలి.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి మహేందర్ రెడ్డి.. రేవంత్‌పై విమర్శలు చేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్.. కొడంగల్‌కు చేసింది సూన్యం అని..అసలు రేవంత్ కొడంగల్ కి చేసింది ఏమిటి అని నిలదీశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఇదిలా ఉంటే రేవంత్ రోజు రోజు కి కొడంగల్ మీద పట్టుకోల్పోతున్నారు..తనకి ఎంతో నమ్మకమైన వారు సైతం టీఆర్ఎస్ లోకి వెళ్లిపోవడంతో రేవంత్ ఒకింత ఆందోళనకి గురవ్వుతున్నారని తెలుస్తోంది.

ఒక పక్క భారీ వలసలతో కాంగ్రెస్ లోకి రావాలని రాహుల్ చెప్పడంతో..దానికి సరే అన్న రేవంత్ ఇప్పుడు ఏమి చేయాలో తెలియక తికమక పడుతున్నారట..సొంత నియోజకవర్గం లోనే తన బలగం అంతా కారు ఎక్కేస్తుంటే మరి రేవంత్ తో నడిచే వాళ్ళు ఎంతమంది ఉంటారో అని కాంగ్రెస్ వాళ్ళు ఆలోచనలో పడ్డారని టాక్.రేవంత్ ని నమ్ముకుని వెళ్తే మాకు రాజకీయ భవిషత్తు ఉండదని అందుకే మేము టీఆర్ఎస్ లోకి వెళ్తున్నామని జంప్ అవుతున్న నేతలు భాహటంగానే చెప్తున్నారట.మరి కేసీఆర్ రేవంత్ కి ఇంకెన్ని షాకులు ఇస్తారో వేచి చూడాల్సిందే