బాల‌య్య‌కు షాక్ ఇచ్చిన కేసీఆర్‌   Kcr Gives Shcok To Balakrishna     2017-01-12   05:25:05  IST  Bhanu C

తెలంగాణ సీఎం కేసీఆర్ మాట ఇచ్చారంటే త‌ప్ప‌డం అసాధ్యం. ఆయ‌న రాజ‌కీయంగా అయినా, ఎవ‌రికి అయినా ఓ ప‌ని చేస్తాన‌ని హామీ ఇచ్చారంటే సాధ్య‌మైనంత వ‌ర‌కు ఆయ‌నే స్వ‌యంగా దానిని ఫాలోఅప్ చేసి మ‌రీ ప‌ని పూర్తి చేయిస్తార‌న్న పేరు ఉంది. అయితే కేసీఆర్ యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ‌కు ఓ విష‌యంలో మాట ఇచ్చి త‌ప్పారు. బాల‌య్య హీరోగా తెర‌కెక్కిన 100వ సినిమా గౌతమిపుత్ర శాత‌క‌ర్ణి సినిమా షూటింగ్ ప్రారంభోత్స‌వానికి కేసీఆర్ వ‌చ్చారు. ఆ రోజు కేసీఆర్ ఈ సినిమా స్పెష‌ల్ షోను త‌న‌కు చూపించాల‌ని బాల‌య్య‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

కేసీఆర్ అంత‌టివాడే స్వ‌యంగా అడ‌గ‌డంతో బాల‌య్య వెంట‌నే అదే వేదిక మీద ఓకే చెప్పేశారు. ఈ క్ర‌మంలోనే శాత‌క‌ర్ణి చ‌రిత్ర‌తో ముడిప‌డి ఉన్న క‌థ కావ‌డంతో ఈ సినిమాకు ముందుగా కేసీఆరే తెలంగాణ‌లో ప‌న్ను మిన‌హాయించారు. ఇక ఈ రోజు శాత‌క‌ర్ణి రిలీజ్ అయ్యి బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్ తెచ్చుకుంది. కేసీఆర్‌ను బాల‌య్య స్పెష‌ల్ షోకు ఆహ్వానించారు.

కేసీఆర్ కోసం ఈ రోజు ఉద‌యం ప్ర‌సాద్ ఐమ్యాక్స్‌లో ఉద‌యం 11 గంట‌ల‌కు స్పెష‌ల్ షో ప్లాన్ చేశారు. ఈ మేర‌కు కేసీఆర్‌కు బాల‌య్యే స్వ‌యంగా ఈ షో టైమింగ్స్‌, డీటైల్స్ చెప్పి వ‌చ్చారు. సీఎం కేసీఆర్ శాత‌క‌ర్ణి స్పెష‌ల్ షోకు వ‌స్తార‌న్న ప్ర‌చారంతో అంద‌రి క‌ళ్లు ఒక్క‌సారిగా ప్ర‌సాద్ ఐమ్యాక్స్ మీదే ప‌డ్డాయి. అక్క‌డ మీడియా వాళ్లు వాలిపోయారు. సినిమా చూశాక కేసీఆర్ శాత‌క‌ర్ణి గురించి ఏం చెపుతారా ? అన్న ఆస‌క్తి అంద‌రిలోనె నెల‌కొంది.

అయితే మ‌రి కేసీఆర్‌కు అంత ముఖ్య‌మైన ప‌ని ఏం ప‌డిందో కాని ఆయ‌న ఈ స్పెష‌ల్ షోకు డుమ్మా కొట్టారు. సీఆర్ వస్తారని ఆశగా చూసిన వారికి నిరాశే మిగిలిందని చెప్పాలి. అయితే కేసీఆర్ ఈ షోకు రాక‌పోవ‌డానికి కార‌ణాలు మాత్రం తెలియ‌లేదు. మ‌రి కేసీఆర్ బాల‌య్య‌కు ఇచ్చిన మాట ప్ర‌కారం శాత‌క‌ర్ణి సినిమాను ఎప్పుడు చూస్తారో చూడాలి.