హరీష్‌ రావుకు కీలక బాధ్యతలు అప్పగించిన కేసీఆర్‌  

Kcr Give The Some Powers To Harish Rao - Telugu Assembly Meeting In Soon, Kcr, Kcr Cabinet Minister, , Oppositions Leaders Asking Questions To Kcr

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇటీవలే మంత్రి వర్గ విస్తరణ నిర్వహించి కొత్తగా ఆరుగురికి స్థానం కల్పించిన విషయం తెల్సిందే.గత కొన్నాళ్లుగా మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న హరీష్‌ రావుకు ముఖ్యమైన ఆర్ధిక శాఖను ఇవ్వడం జరిగింది.

Kcr Give The Some Powers To Harish Rao

ప్రస్తుతం కేసీఆర్‌ వద్ద కీలకమైన రెవిన్యూ మరియు నీటిపారుదల శాఖతో పాటు ఇంకా పలు శాఖలు ఉన్నాయి.త్వరలో అసెంబ్లీ సమావేశాల సందర్బంగా సభ్యులు అడుగబోతున్న ప్రశ్నలకు సమాధానాలు అన్ని కూడా కేసీఆర్‌ ఇవ్వలేడు.

హరీష్‌ రావుకు కీలక బాధ్యతలు అప్పగించిన కేసీఆర్‌-Political-Telugu Tollywood Photo Image

అందుకే తన వద్ద ఉన్న శాఖలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిందిగా హరీష్‌ రావు, కేటీఆర్‌ ఇంకా ఇతర మంత్రులకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.గతంలో హరీష్‌ రావు నీటి పారుదల శాఖను చూశాడు కనుక ప్రస్తుతం అసెంబ్లీలో సభ్యులు ఆ శాఖకు సంబంధించి అడిగే ప్రశ్నలకు సంబంధించిన ప్రశ్నలకు ఆయనే సమాధానం ఇవ్వాలని కేసీఆర్‌ సూచించాడు.9 రోజుల పాటు జరుగబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం సర్వం సిద్దం అయ్యి సమాధానం ఇచ్చేందుకు రెడీగా ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు