సమ్మెకు ఎన్నికలకు లింక్ పెట్టేసిన కేసీఆర్

టిఆర్ఎస్ అధినేత, సీఎం కెసిఆర్ రాజకీయ ఎత్తుగడలు ఒక పట్టాన ఎవరికి అర్థం కావు.ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా తనకు అనుకూలంగా మార్చుకోవడంలో కెసిఆర్ సిద్ధహస్తుడు.

 Kcr Give The Link To Strike And Huzurnagar Elections-TeluguStop.com

ప్రస్తుతం తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె గొడవ తీవ్ర స్థాయిలో ఉంది.సమ్మెలో పాల్గొన్న వారందరూ వెంటనే విధుల్లో చేరకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన కేసీఆర్ ఆ తరువాత వారు అసలు ఆర్టీసీ ఉద్యోగులే కాదంటూ వారికి వారు సెల్ఫ్ డిస్మిస్ అయిపోయారు అని ప్రకటించి సంచలనం సృష్టించారు.

దీనిపై ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ ఒక నియంత అంటూ విమర్శలు చేసాయి.‌ అయితే సమ్మె విషయంలో కెసిఆర్ ఆ స్థాయిలో దూకుడు ప్రదర్శించడం వెనుక హుజూర్ నగర్ ఉప ఎన్నికలే కారణమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Telugu Congress Bjp, Kcrgive, Rtcemployes-Telugu Political News

  ఇక టిఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీలు ఈ అంశాన్ని ఉపయోగించుకుని హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో కెసిఆర్ నియంతృత్వాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని సిద్ధమవుతున్నాయి.అయితే ఇదే అంశాన్ని తనకు సానుకూలంగా మలుచుకుని ముందుకు వెళ్లాలని కెసిఆర్ ప్లాన్ చేసుకున్నాడు.సమ్మె పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఎటువంటి కఠిన నిర్ణయం అయినా తీసుకునేందుకు కెసిఆర్ వెనుకాడరు అనే మెసేజ్ ప్రజల్లోకి వెళితే టిఆర్ఎస్ పరపతి పెరిగి హుజూర్ నగర్ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు వస్తాయని కెసిఆర్ అంచనా వేస్తున్నాడు.అందుకే ఆర్టీసీ కార్మికుల విషయంలో అంత ఘాటుగా వ్యవహరిస్తున్నట్టు గా కనిపిస్తోంది.

Telugu Congress Bjp, Kcrgive, Rtcemployes-Telugu Political News

 

ఇక ప్రభుత్వ ఉద్యోగులు అంటే లంచాలు తీసుకోవడంతో పాటు తమను నానా తిప్పలు పెడతారనే భావన ప్రజల్లో ఉందనే విషయాన్ని కెసిఆర్ గుర్తించాడు.ప్రస్తుతానికి ఉద్యోగులను మంచి చేసుకునేందుకు చూడడం కంటే వారి విషయంలో కఠినంగా ఉండి ప్రజల మద్దతు కూడగట్టుకోవడంపై దృష్టి పడితే బెటర్ అన్న ధోరణి కెసిఆర్ లో కనిపిస్తోంది.అయితే ఈ విషయాన్ని కనిపెట్టిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమ్మెలో ఆర్టీసీ కార్మికులు నిర్వర్తించిన పాత్రను ప్రజల్లోకి తీసుకు వెళ్లి, వారిపై ప్రజల్లో సానుభూతి వచ్చేలా చేయడంతో పాటు కెసిఆర్ వారికి అన్యాయం చేసిన తీరుపై ప్రజల నుంచి వ్యతిరేకత పెరిగేలా చేయాలని చూస్తోంది.అయితే ఈ రెండు పార్టీల ఎత్తుగడలు ఎంతవరకు ఫలిస్తాయో, ఈ ఆర్టీసీ కార్మికుల సమ్మె హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాలను ఎంతమేరకు ప్రభావితం చేస్తాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube