ఎమ్మెల్యేలకు గులాబీ బాస్ వార్నింగ్ ఎందుకు ఇచ్చాడు ?

గులాబీ బాస్ కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలకు సీరియస్ క్లాస్ పీకిన వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.అసలు కేసీఆర్ ఇంతగా రియాక్ట్ అవ్వడానికి కారణం కూడా లేకపోలేదట.

 Kcr Give The Istructions To Trs Party Mlas-TeluguStop.com

చాలాకాలంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద సీఎం కేసీఆర్ కు సదభిప్రాయం లేదు.అందుకే ఆ డిపార్ట్మెంట్ మీద కేసీఆర్ ఆగ్రహంగానే ఉంటూ వస్తున్నారు.

Telugu Kcr Trs Mlas, Suresh Farmmar-

తాజాగా తహశీల్ధార్ మీద పెట్రోల్ దాడి జరగడం, ఆమె అక్కడికక్కడే మరణించడంతో ఒక్కసారిగా అందరి చూపు ఆ డిపార్ట్మెంట్ మీద పడింది.సోషల్ మీడియా లో అయితే తహశీల్ధార్ చేసింది తప్పు కాబట్టే రైతు ఆగ్రహంతో ఆమె కు నిప్పు పెట్టాడు అంటూ ట్రోలింగ్స్ చేస్తున్నారు.ఈ వ్యవహారంతో ఆ శాఖ మీద ప్రభుత్వం ఆచి తూచి వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.తహసీల్దార్ దారుణ హత్య తరువాత ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో తహసీల్దార్ లు విధులు నిర్వర్తించేందుకు వణికిపోతున్నారు.

ఈ ఘటన జరిగిన తరువాత చాలా చోట్ల తమ సమస్యలని పరిష్కరించకపోతే పేట్రోల్ పోసి నిప్పు పెడతాం, లేకపోతే మీ ఆఫీస్ కు వచ్చి నిప్పు పెట్టుకుంటాం అనే బెదిరింపు ధోరణిలు ఎక్కువగా పెరిగిపోయాయి.

Telugu Kcr Trs Mlas, Suresh Farmmar-

అని కానీ పెట్రోల్ పోసుకొని ఆఫీస్ లోనే ఆత్మహత్య చేసుకుంటాం అని బెదిరించే వారు బాగా ఎక్కువైపోయారు.దీనితో తహసీల్దార్ లు తమకి ప్రభుత్వం సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు.అయితే ఈ విషయంలో కేసీఆర్ కూడా అప్రమత్తం అయినట్టు తెలుస్తోంది.

అందుకే ముందుగానే ఎమ్యెల్యేలకు తగిన హెచ్చరికలు చేసినట్టు తెలుస్తోంది.భూమికి సంభందించిన వ్యవహారాల్లో మీరు ఎవరూ జోక్యం చేసుకోవద్దని అలా చేస్తే ఆ తరువాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారట.

అలాగే రియల్ ఎస్టేట్ జోలికి వెళ్లొద్దు, భూమి పంచాయతీల్లో తల దూర్చకండి అని సూచనలు చేశారట.తహశీల్ధార్ విజయారెడ్డి హత్య తరువాత అంతా అప్రమత్తంగానే వ్యవహరిస్తున్నట్టు దీన్నిబట్టి అర్ధం అవుతోంది.

Telugu Kcr Trs Mlas, Suresh Farmmar-

సాధారణంగా ఎమ్మెల్యేల వద్దకు ఎక్కువగా వచ్చే ఫిర్యాదుల్లో భూమికి సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువ.అదే సమయంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ అవినీతి మీద జనాలు ఎక్కువ కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు.ఇక ప్రజల్లో రెవెన్యూ శాఖ పై ఉన్న కోపం ఎమ్మెల్యేల పైకి మళ్లితే వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని గమనించిన సీఎం కేసీఆర్ కాస్త ముందుగానే మేల్కొని ఈ విధంగా అప్రమత్తం అయ్యి పార్టీకి ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా సిద్ధం అయినట్టు కనిపిస్తోంది.భూములకు సంబంధించిన వ్యవహారంలో ఎవరికి సహాయం చేసినా మరొకరు శత్రువులు గా మారిపోతారు.

ఇది ముందుగానే అర్ధం చేసుకున్న గులాబీ బాస్ ఇటువంటి వివాదాల్లో తమ ఎమ్యెల్యేలు దూకుడుగా ముందుకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు ఇప్పటి నుంచే తీసుకున్నట్టు కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube