తెలంగాణలో ఒక్కరి పరిస్థితి మాత్రమే కష్టంగా ఉందన్న సీఎం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనాపై యుద్దంను చాలా సీరియస్‌గానే చేస్తోంది.ఒకవైపు కరోనా పాజిటివ్‌ కేసులు అంతకంతకు పెరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగితే వారికి మెరుగైన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

 Kcr Give The Clarity About Corona Patients, Telangana, Corona Virus, Hyderabad,-TeluguStop.com

జిల్లా కేంద్రాలతో పాటు హైదరాబాద్‌లోని పలు హాస్పిటల్స్‌లో కరోనా కేసులకు చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

తెలంగాణలో కరోనా పాజిటివ్‌లుగా నమోదు అయిన 11 మంది ఆరోగ్యం కుదుట పడిరదని వారికి టెస్టు నెగటివ్‌ వచ్చిందని వారిని నేడు హాస్పిటల్‌ నుండి డిశ్చార్జ్‌ చేస్తామంటూ కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెల్సిందే.

ఇంకా ఇతరుల పరిస్థితి కూడా ఆందోళన కరంగా ఏమీ లేదని, అందరికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లుగా ప్రకటించారు.కరోనా సోకిన వారిలో ఒక్కరి పరిస్థితి మాత్రం కాస్త సీరియస్‌గా ఉందని వారిని కూడా కాపాడేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube