ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్‌ మరో గడువు

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఏమాత్రం కరెక్ట్‌ కాదంటూ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీని మరింత దిగజార్చడానికే ఈ సమ్మె అంటూ వ్యాఖ్యనించాడు.

 Kcr Give The Anothe Chance To Rtc Workers-TeluguStop.com

డ్యూటీకి హాజరు కాని కార్మికులు స్వచ్చందంగా ఉద్యోగ విరమణ చేసినట్లుగా భావించాలంటూ ఆర్టీసీ యాజమాన్యంకు కేసీఆర్‌ ఆదేశించిన విషయం తెల్సిందే.దాంతో టెక్నికల్‌గా ఆర్టీసీ కార్మికులు అంతా కూడా ఉద్యోగాలు కోల్పోయినట్లు అయ్యింది.

కాని కేసీఆర్‌ తాజాగా మరో సారి ఆర్టీసీ కార్మికులకు ఛాన్స్‌ ఇచ్చాడు.

ఈనెల 5వ తారీకు లోపు సమ్మె విరమించి ఉద్యోగాల్లో చేరాలంటూ కేసీఆర్‌ విజ్ఞప్తి చేశాడు.

నేడు ఆర్టీసీ సమ్మెపై ప్రత్యేకంగా క్యాబినేట్‌ సమావేశంను నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కుదరదని తేల్చి చెప్పారు.

రాష్ట్రంలోని దాదాపు 5 వేల రూట్లను ప్రైవేటీకరణ చేసేందుకు సిద్దం అయినట్లుగా ప్రకటించాడు.ఆర్టీసీ కార్మికులు కూడా మా బిడ్డలే.

వారిని మేము చులకనగా చూడటం లేదు.వారు కార్మిక సంఘాల నాయకుల మత్తులో పడ్డారు.

వారు బయట పడి ఆర్టీసీని కాపాడుకోవాలంటూ కేసీఆర్‌ కోరాడు.మరి ఈ గడువు వరకు అయినా ఆర్టీసీ కార్మికులు డ్యూటీలో జాయిన్‌ అవుతారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube