ఏపీలో కేసీఆర్ కి పెరుగుతున్న క్రేజ్ ! ఎవరికి లాభం...?

ప్రజల నాడి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము.రాజకీయాల్లోనూ అంతే.

 Kcr Gets Huge Fans Following In Andhra Pradesh1-TeluguStop.com

ఏం జరుగుతుంది .? ఎవరికి క్రేజ్ ఉంటుంది… ఆ క్రేజ్ ఎందుకు వస్తుంది అనేది ఎవరికీ తెలియదు.కొన్ని కొన్ని అకస్మాత్తుగా అలా జరిగిపోతూవుంటాయి.ఈ విధంగానే తెలంగాణ సీఎం కేసీఆర్ కి ఏపీలో ఇప్పుడు ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.తెలంగాణలో టిఆర్ఎస్ ప్రత్యర్థులంతా ఏకమై టిఆర్ఎస్ పార్టీని ఓడించాలని చూసినా…కేసీఆర్ ఎత్తులు ముందు అవి చిత్త అయిపోయాయి.దీంతో ఒక్కసారిగా తెలుగు తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ కి క్రేజ్ పెరిగిపోయింది.

అందుకే తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ గెలవగానే ఏపీలో సంబరాలు చేసుకున్నారు.ప్లెక్సీలు పెట్టారు …పాలాభిషేకం చేశారు.

ఇలా కొత్త ట్రెండ్ సృష్టించారు.అదే ఉత్సాహంతో కేసీఆర్ కూడా ఏపీ పై ఇప్పుడు ఎక్కడలేని ప్రేమ కురిపిస్తున్నారు.

తెలంగాణ రాజకీయాలను కూడా పక్కనపెట్టి ఇప్పుడు ఫోకస్ మొత్తం ఏపీ పైనే పెట్టాడు అందుకే తెలంగాణలో పార్టీ గెలవగానే ముందుగా విశాఖ చేరుకున్నారు అక్కడ కూడా ఆయనకి ఎవరూ ఊహించని స్థాయిలో స్వాగతం లభించింది.దీంతో ఆయనను మరింత ఉత్సాహం పెరిగింది.అందుకే అందుకే వివిధ రాష్ట్రాల పర్యటనలో పూర్తిచేసుకుని కేసీఆర్ తెలంగాణ లోకి అడుగు పెట్టగానే ప్రెస్ మీట్ పెట్టి మరి ఏపీ రాజకీయాల గురించి కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడాడు.

ఏపీ ప్రజలు అంటే నాకు కోపం లేదని ప్రత్యేక హోదా గురించి ఎప్పుడు ఎక్కడ మాట్లాడమన్నా అనుకూలంగా చెప్తానని, అవసరమైతే లెటర్ కూడా ఇచ్చి ప్రత్యేక హోదా కోసం తాను రంగంలోకి దిగుతానని సంచలన ప్రకటన చేసాడు.నేను ప్రత్యేక హోదా అడ్డుపడుతున్నారని చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ ప్రకటించడంతో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి.ఓహో ఇది నిజమేనా కేసీఆర్ ఈ ఏపీ అంటే ఎంత ప్రేమ ఉందా అని సంబర పడ్డారు ఏపీ ప్రజలు.

అయితే ఏపీలో టిఆర్ఎస్ పార్టీ లేదు .ఇక్కడ పోటీ చేసే వాతావరణం కూడా కనిపించడం లేదు.అయినా ఏపీ గురించి కెసిఆర్ తాపత్రయ పడుతున్నట్లు గా కనిపించింది.

తన రాజకీయ విరోధిగా ఉన్న చంద్రబాబు మీద కూడా కెసిఆర్ విరుచుకుపడ్డారు.

దీంతో టిడిపి ఆత్మరక్షణలో పడిపోయింది.కేసీఆర్ వ్యాఖ్యలకు తెలుగు తమ్ముళ్లు కౌంటర్లు వేసినా అవి ఆశించిన స్థాయిలో మాత్రం వర్కవుట్ అవ్వలేదు.

జగన్ కావాలనే తనపై కక్ష కట్టి ఇలా చేయించారని, ఏపీని విభజించిన, పోలవరానికి, ప్రత్యేక హోదాకు కూడా అడ్డుపడిన కేసీఆర్‌తో జట్టుకట్టుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నాడని బాబు విమర్శించారు.దీనినే ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా మార్చాలని చూసారు.

కానీ కేసీఆర్ ఏపీ స్పెషల్ స్టేటస్ విషయంలో క్లారిటీగా మాట్లాడడంతో జగన్ కేసీఆర్ తో స్నేహ చేస్తే బాబు కి వచ్చిన నొప్పి ఏంటి అనే అభిప్రాయం ప్రజల్లో కూడా వచ్చేసింది.

ఏపీలో కేసీఆర్ కి ముఖ్యంగా… గుంటూరు, కృష్ణా, అనంతపురం, శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదరణ ఎక్కువగా కనిపిస్తోంది.ఈ పరిణామాలు అధికార పార్టీ టీడీపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.ఈ క్రేజ్ అంతా… జగన్ ఖాతాలో పడే అవకాశం ఉంటుందేమో అనే కంగారులో టీడీపీ ఆందోళన చెందుతోంది.

అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారం చేస్తే… ? అది ఖచ్చితంగా తమ ఓటు బ్యాంక్ మీద దెబ్బ పడుతుంది అని టీడీపీ ఆందోళన చెందుతోంది.ఈ విషయంలో వైసీపీ లో ఎక్కడలేని జోష్ కనిపిస్తోంది.

ఏపీలో కేసీఆర్ క్రేజ్ ఎంత పెరిగితే ఆ క్రెడిట్ అంతా తమ ఖాతాలోకే వస్తుంది అని లెక్కలు వేసుకుంటోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube