కుల లెక్కల్లో కేసీఆర్ ? హుజూరాబాద్ కోసం ఎంతగా అంటే ? 

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ కి ఎక్కడా పట్టు చేజారిపోకుండా తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.బలమైన అభ్యర్థి గా ఉన్న ఈటల రాజేందర్ ను ఢీ కొట్టేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు.

 Kcr Forgetting Political Equations Huzurabad Based On Castes-TeluguStop.com

కేంద్ర అధికార పార్టీ బిజెపి తరపున పోటీ చేస్తుండడం తో కేంద్ర మంత్రులు ప్రచారానికి దిగే అవకాశం ఉండడం, ప్రభుత్వ వ్యతిరేకతను రాజేందర్ హైలెట్ చేస్తుండటం, ఇక్కడ ఆరుసార్లు ఎమ్మెల్యేగా చేసిన అనుభవం రాజేందర్ కు ఉండటం తదితర కారణాలతో ఈ నియోజకవర్గంపై ఎప్పుడూ లేనంతగా కేసీఆర్ దృష్టి సారించి, భారీఎత్తున నిధుల వరద ను ఈ నియోజకవర్గంలో కి మళ్లిస్తున్నారు.

      ఎక్కడా చిన్న అవకాశం కూడా రాజేందర్ కు దక్కకుండా చూసుకుంటున్నారు.

 Kcr Forgetting Political Equations Huzurabad Based On Castes-కుల లెక్కల్లో కేసీఆర్ హుజూరాబాద్ కోసం ఎంతగా అంటే  -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో పాటు కొత్తగా తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి ప్రభావం ఏమాత్రం కనిపించకుండా కేసీఆర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఈ నియోజకవర్గంలో టిఆర్ఎస్ నేతలు ఎవరూ రాజేందర్ వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే, రాజేందర్ ముఖ్య అనుచరులను టిఆర్ఎస్ లోకి తీసుకు వచ్చి కీలక పదవులు కట్టబెడుతూ ఆయనను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ హుజూరాబాద్ నియోజకవర్గం లో ఉన్న రెండు లక్షల ఇరవై ఆరు వేల మంది ఓటర్లలో దాదాపు 45 వేల ఓటర్లు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో, ఈ సామాజిక వర్గాన్ని పూర్తిగా తమ దారిలోకి తెచ్చుకుంటేనే గెలుపు పెద్ద కష్టమేమీ కాదనేది కెసిఆర్ అభిప్రాయం.
     

  అందుకే భారీ బడ్జెట్ తో కూడుకున్న దళిత బంధు పథకాన్ని ఈ నియోజకవర్గం నుంచి కేసీఆర్ మొదలుపెట్టారు.పూర్తిగా ఈ నియోజకవర్గంలో అమలు చేసి ఆ తరువాత తెలంగాణ అంతటా అమలు చేస్తానని కేసీఆర్ చెబుతున్నా,  దళిత కుటుంబానికి 10 లక్షలు అందించడం అంటే ఆషామాషీ కాదు.ఈ విషయం కేసీఆర్ కు తెలిసినా, ఇక్కడ గట్టెక్కేందుకు మరోమార్గం లేక పోవడంతో ఈ భారీ పథకం ను ఎంచుకున్నారు.

ఇక పద్మశాలీ సామాజిక వర్గం ఓట్లు 26000 ఉన్నాయి.అందుకే తెలంగాణ టిడిపి అధ్యక్షుడు రమణ ను తమ పార్టీలోకి తీసుకువచ్చి ఆయనకు టిఆర్ఎస్ కండువా కప్పారు.

ఆయన ద్వారా ఆ సామాజిక వర్గం నాయకులు అందర్నీ గ్రిప్ లోకి తెచ్చుకొని ఓటర్లు చెక్కుచెదరకుండా , టిఆర్ఎస్ కు ఓటు వేసే విధంగా ముందుగానే ప్లాన్ చేసుకున్నారు.ఇక మిగిలిన బి సి, రెడ్డి సామాజిక వర్గం లోని ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా సామాజిక వర్గాలకు చెందిన నాయకులకు ఎక్కడలేని ప్రాధాన్యం ఇస్తున్నారు.

కాంగ్రెస్ నుంచి కౌశిక్ రెడ్డి ని టిఆర్ఎస్ లోకి తీసుకురావడానికి ఇదే కారణంగా తెలుస్తోంది.ఇలా ఏ చిన్న అవకాశం దొరికినా కేసీఆర్ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తూ, గెలుపుకు బాటలు వేసుకుంటునట్టుగా కనిపిస్తున్నారు.

#Ramana #Hujurabad #Dalitha Bandu #Dalitha #Etela Rajender

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు